Rajat patidar: ‘ఇంకా ఒక్క మ్యాచే ఉంది.. కలిసి సంబరాలు చేసుకుందాం’: ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ మెసేజ్
Rajat patidar: ‘ఇంకా ఒక్క మ్యాచే ఉంది.. కలిసి సంబరాలు చేసుకుందాం’: ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ మెసేజ్"
Play all audios:
పంజాబ్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానులకు ఒక సందేశం ఇచ్చాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 (IPL) టైటిల్‌ను
దక్కించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను (Punjab Kings) చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్‌కు
దూసుకెళ్లింది. పంజాబ్‌పై భారీ విజయం సాధించి ఊపు మీదున్న బెంగళూరు మరో విజయం సాధించి టైటిల్ కరవును తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్
పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానులకు ఒక సందేశం ఇచ్చాడు. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన జట్టుపై అభిమానుల ఆదరణ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. టైటిల్ గెలుస్తామనే ధీమా వ్యక్తం
చేస్తూ.. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చాడు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా
ఉపయోగించుకున్నారు. సుయాశ్ బౌలింగ్ అద్భుతం. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడు. కెప్టెన్‌గా అతడు బౌలింగ్ ఎలా చేస్తాడో నాకు అవగాహన ఉంది. వికెట్లను లక్ష్యంగా చేసుకోని బంతులను సంధిస్తాడు.
అదే అతని బలం. సుయాశ్ బౌలింగ్‌ను బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టం. ఎప్పటికప్పుడు అతడికి సూచనలు ఇస్తుంటా. అతడిని కంగారు పెట్టడం ఇష్టం లేదు. కొన్నిసార్లు పరుగులు ఇచ్చినా మద్దతు ఇస్తూనే ఉంటా.
టోర్నీ ఆసాంతం చాలా ప్రాక్టీస్ చేశాం. ప్రతి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం గొప్పగా ఉంటుంది. శుభారంభం అందిస్తున్న తీరు గురించి ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు. నేను ఫిల్ సాల్ట్‌కు పెద్ద అభిమానిని. ఆర్సీబీ అభిమానులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. మేము ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా దాన్ని మా హోమ్ గ్రౌండ్ లానే భావిస్తాము.
ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. కలిసి సంబరాలు చేసుకుందాం’ అని రజత్ పేర్కొన్నాడు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Rajat patidar: ‘ఇంకా ఒక్క మ్యాచే ఉంది.. కలిసి సంబరాలు చేసుకుందాం’: ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ మెసేజ్పంజాబ్తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానుల...
Polycet 2025 results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రేపే.. రిజల్ట్స్ ఈనాడు. నెట్‌లో చూడొచ్చుతెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్(TG Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్...
Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఈ సీజన్‌ల...
Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదలతెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనల...
Corona virus: కొవిడ్ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పా...