Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలు
Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ఆ జట్టు సారథి అజింక్య రహానె (Ajinkya Rahane) స్పందించాడు. ఐపీఎల్ (IPL 2025)లో ఆటగాడి ప్రదర్శనపై ధర ఎలాంటి ప్రభావం చూపదంటూ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. రూ.20కోట్లకు పైగా ఇచ్చినంత
మాత్రాన.. అతడు రెట్టింపు కష్టపడాలని కాదన్నాడు. ‘‘రూ.20 కోట్లు అంతకంటే ఎక్కువ అందుకుంటున్నామని ఎవరూ రెట్టింపు కష్టపడి పనిచేయరు. అలాగే.. రూ.కోటి, రూ.2కోట్లు, రూ.3కోట్లు మాత్రమే
తీసుకుంటున్నామని ఎవరూ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోరు. మైదానంలోకి వచ్చిన తర్వాత ఆటగాళ్ల ప్రవర్తనలో ఎలాంటి తేడా ఉండదు. అదే ఇక్కడ చాలా ముఖ్యం. ఒక ఆటగాడిపై మన నియంత్రణలో ఉన్న అంశాలపై మాత్రమే
దృష్టిపెడతాం. వెంకటేశ్ అయ్యర్ కూడా అలాగే ఫోకస్ చేశాడు. అతడి ప్రవర్తన అద్భుతం. పేలవ ప్రదర్శన అనేది ఏ ఆటగాడికైనా ఎప్పుడో ఒక సందర్భంలో ఎదురయ్యేదే. అంతేగానీ.. ప్రైస్ ట్యాగ్ దీనికి కారణం
కాదు. ప్రైస్ ట్యాగ్ గురించి అతడు ఆలోచిస్తాడని నేను అనుకోను’’ అని రహానె తెలిపాడు. * కెప్టెన్‌గా నీ ప్రవర్తనే ఇప్పుడు చాలా ముఖ్యం: గిల్‌కు గావస్కర్ సూచన గతేడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన
కోల్‌కతా (KKR).. ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోయింది. మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి మరీ ఈ జట్టు సొంతం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్.. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 20.28 సగటుతో
కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఇక, గతేడాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్, రసేల్, రమన్‌దీప్ కూడా ఈ సారి రాణించలేకపోయారు. దీనిపై కూడా రహానె స్పందించాడు. ‘‘ఛాంపియన్‌షప్‌ను
గెలవడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. జట్టుతో మేం ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాం. కానీ కొన్ని సార్లు వైఫల్యాలు తప్పలేదు. వచ్చే సీజన్‌కు బలంగా తిరిగొస్తాం’’ అని
రహానె ఆశాభావం వ్యక్తం చేశాడు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Latests News
Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఈ సీజన్‌ల...
Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదలతెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనల...
Corona virus: కొవిడ్ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పా...
Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్..ఇంటర్నెట్ డెస్క: ఇరాన్ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (23/05/2025)23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...