17న ఎంగిలిపూల బతుకమ్మ 

Sakshi

17న ఎంగిలిపూల బతుకమ్మ "

Play all audios:

Loading...

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. దీన్ని తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర


వైదిక పురోహిత సంఘం బాధ్యులు మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ‘కుడా’ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. పండుగల నిర్వహణపై చర్చించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ పలు తీర్మానాలు చేశారు.


ఈ నెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య (పితృ అమావాస్య) రోజున ఎప్పటిలాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతో పాటు అదేరోజు ఆనవాయితీ ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. నెల రోజుల


తర్వాత అక్టోబర్‌ 17వ తేదీ శనివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తిథి మొదలు 8 రోజుల పాటు బతుకమ్మ ఆడుకొని అదే నెల 24వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మ


జరుపుకోవాలన్నారు. గతంలో 1963, 1982, 2001ల్లో కూడా ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని ఈ సందర్భంగా పండితులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పురోహిత సంఘం రాష్ట్ర


కన్వీనర్‌ తాండ్ర నాగేంద్రశర్మ, పండితులు ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, తాండ్ర పిచ్చయ్యశాస్త్రి, వెలిదె యుగేందర్‌శర్మ, డాక్టర్‌ ప్రసాద్‌శర్మ, మరిగంటి శ్రీకాంతాచార్య, డింగరి వాసుదేవాచార్యులు,


గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, గంగు సత్యనారాయణశర్మ, డాక్టర్‌ శేషభట్టార్‌ వెంకటరమణాచార్యులు, మెట్టెపల్లి హరిశర్మ, పీతాంబరి శ్రీకాంతాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు


ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. 


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Mahindra scorpio n: ఈ కారే కావాలి అంటున్న ప్రజలు.. జోరుగా సేల్స్.. ఏంటి దీని ప్రత్యేకత?

ఈ కారులో 6, 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 4-6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, హిల్-హోల్డ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్...

Bhairavam movie review: రివ్యూ: భైరవం.. ముగ్గురు హీరోల యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

Bhairavam movie review || చిత్రం: భైరవం; నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్‌, అదితి శంకర్‌, ఆ...

Keneeshaa: జయం రవితో రిలేషన్‌.. అత్యాచార బెదిరింపులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన కెనీషా..

తనను బెదిరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి గాయని కెనీషా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Bellamkonda sai srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు

హైదరాబాద్‌: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai srinivas)పై కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట...

Top