Vivek agnihotri: రణ్‌బీర్‌ను బాయ్‌కాట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: దర్శకుడు
Vivek agnihotri: రణ్‌బీర్‌ను బాయ్‌కాట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: దర్శకుడు"
Play all audios:
‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి: బాలీవుడ్‌లోని తాజా
పరిస్థితులపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని దర్శక - నిర్మాతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందీ ఫిల్మ్ మేకర్స్‌కు నటీనటులపై కోపం ఉన్నా..
వాళ్లు ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పలేరన్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ (Animal) చిత్రానికి వచ్చిన విమర్శలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు కేవలం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
(Sandeep Reddy Vanga)నే టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)ను విమర్శించే ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ‘యానిమల్’ చిత్రానికి సందీప్‌నే
తప్పుపట్టడంపై మాట్లాడుతూ రణ్‌బీర్‌ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదని.. ఇండస్ట్రీలో అతడు ఎంతో పవర్‌ఫుల్ అని తెలిపారు. ‘‘అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా. అతడిని విమర్శించేవారు
ఎవరు? ఒక్కసారి ప్రయత్నించమని చెప్పండి. నేను సవాలు చేస్తోన్న నటీనటుల గురించి తప్పుగా మాట్లాడని ఒక్క దర్శక-నిర్మాతను చూపించండి. ఎవరినీ చూపించలేరు. ఎందుకంటే ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో
ఒకరిని తిట్టినవారే. కాకపోతే పబ్లిక్‌లో మాత్రం మాట్లాడే ధైర్యం చేయరు. కాబట్టి, వాళ్లు ఇబ్బందిపడక తప్పదు. దారుణంగా యాక్ట్ చేసినా రూ.150 కోట్లు చెల్లిస్తారు. తమ అదృష్టాన్ని కూడా నటీనటులకే
కట్టబెడతారు. అందుకే బాలీవుడ్‌కు దూరంగా ఉండాలనిపిస్తుంది’’ అని వివేక్ తెలిపారు. నిజమైన స్టార్స్‌తో తనకు ఏ ఇబ్బంది లేదన్నారు. కెరీర్ పరంగా ఏమీ సాధించకుండా స్టార్ అనే ట్యాగ్ పెట్టుకొని
చలామణి అయ్యే నటీనటులంటేనే తనకు నచ్చదన్నారు. * రాజమౌళి ‘ఈగ’తో మా సినిమాకు సంబంధం లేదు: నటుడు ఇదే విషయంపై గతంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడారు. ‘‘యానిమల్’ను విమర్శించినవారంతా రణ్‌బీర్‌ను
తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ లేదు. కానీ.. విషయం ఏమిటంటే.. వారంతా రణ్‌బీర్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు స్పష్టంగా అర్థమైంది. నేను
పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శించడం చాలా సులభం. యానిమల్‌ను విమర్శించిన వారంతా రణ్‌బీర్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టే అతడిని ఏమీ అనలేదు. ఇది నిజం’’ అని అన్నారు.
Trending News
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...
సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Latests News
Vivek agnihotri: రణ్‌బీర్‌ను బాయ్‌కాట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: దర్శకుడు‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ పరి...
Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?Published by: Last Updated:July 29, 2022 4:16 PM IST BANGLADESH: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేం...
Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక.. మీ ప్రధానికి వెళ్ల...
లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖముంబై : కోవిడ్-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూన...
లెజెండరీ నటి కన్నుమూతసాక్షి, ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియా సిన...