Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..

Eenadu

Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక..  మీ ప్రధానికి వెళ్లి చెప్పండనడంతో వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకొంది. పఠాన్‌


కోట్‌, రియాసీ దాడి వంటి పెద్ద కుట్రలకు కేంద్రాలుగా నిలిచిన శిక్షణ శిబిరాలను నేలమట్టం చేసింది.  మసూద్‌ ఇల్లు.. జైషే ప్రధాన కేంద్రం.. బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌. ఇది సరిహద్దుకు 100


కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్‌కు దీనిని ఆపరేషనల్‌ హెడ్‌క్వార్టర్‌గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. మసూద్‌ అజార్‌ సన్నిహితులు ఈ


కేంద్రం నుంచి ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్‌ వంటివి చేశారు. దీనిని జైషే చీఫ్‌ మసూద్‌ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్‌ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌,


మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. లష్కరే హెడ్‌క్వార్టర్‌.. ఇదో పెద్ద ఉగ్ర యూనివర్సిటీ..


మురిద్కేలోని మర్కాజ్‌ తోయిబా. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్‌ ఇది. ఇందులో మదర్సా, మార్కెట్‌ వంటివి కూడా


ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఈ క్యాంపస్‌దే కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీని నిర్మాణానికి 2000


సంవత్సరంలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ 10 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్‌ కసబ్‌కు ఇక్కడే ఇంటెలిజెన్స్‌ శిక్షణ ఇచ్చారు. ఈ దాడి


కుట్రదారులు డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ, తహవ్వూర్‌ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలు అమిర్‌ హమ్జా, అబ్దుల్‌ రెహ్మాన్‌ అబ్ది, జాఫర్‌ ఇక్బాల్‌ ఈ ప్రాంగణంలోనే నివాసం


ఉంటున్నారు. లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, జకీర్‌ రహ్మన్‌ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లు ఉన్నాయి.  సొరంగాల కేంద్రం.. తెహ్రా కలాన్‌లోని సర్జల్‌ క్యాంప్‌. జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా


జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్‌లోని సాంబా సెక్టార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్‌లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు కేంద్రం. షకర్‌గర్‌ ప్రాంతాన్ని


లష్కరే, జైషేలు సొరంగాల నెట్‌వర్క్‌గా మార్చేశాయి. భారత్‌లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్‌ ప్యాడ్‌. ఇక్కడ కంట్రోల్‌ రూమ్‌ కూడా ఉంది. వీటిల్లో హిజ్బుల్‌


ముజాహిద్దీన్‌ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్‌ సెంటర్లు ఉన్నాయి. జైషే కమాండర్లు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు ఇక్కడ పారా గ్లైడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. పఠాన్‌ కోట్‌


ఎయిర్‌ బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్‌ షాహిద్‌ లతీఫ్‌ ఇక్కడే బ్రెయిన్‌ వాష్‌ చేశాడు. హిజ్బుల్‌ కీలక కేంద్రం.. సియోల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా క్యాంప్‌. అంతర్జాతీయ సరిహద్దుకు 15


కి.మీ. దూరంలో ఉన్న హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలున్నాయి. దీనికి మోహద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్‌


స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్‌ కేవీ కృష్ణారావు ఈ దాడుల నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఈ ఉగ్ర స్థావరంలో దాదాపు 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఇక్కడ


దాదాపు 20-25 మంది ఉంటారు. లష్కరే లాంచ్‌ ప్యాడ్‌.. బర్నాలలోని మర్కాజ్‌ అహ్లే హదిత్‌ ఉగ్ర స్థావరం. ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్‌. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని భింబెర్‌ జిల్లాలో ఉంది. ఇక్కడ 150


మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్‌ ఖాసీం గుజ్జర్‌, అనాస్‌ జరార్‌ నిర్వహిస్తున్నారు. పూంఛ్‌ - రాజౌరి - రియాసీ


సెక్టార్లలోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం.  జైషే ఆయుధాగారం.. కోట్లిలోని మర్కాజ్‌ అబ్బాస్‌ ఉగ్ర స్థావరం. నియంత్రణ రేఖకు 35 కి.మీ. దూరంలో ఈ


క్యాంప్‌ ఉంది. కోట్లీ మిలిటరీ క్యాంప్‌నకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్వహించడం గమనార్హం. ఇక్కడ 125 మంది శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు.


హఫీజ్‌ అబ్దుల్‌ షకూర్‌ అలియాస్‌ ఖారీజరార్‌ ఈ కేంద్రానికి హెడ్‌. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. గతంలో హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌లో పనిచేశాడు. 2016 నగ్రోటాలోని బాలెనీ ఆర్మీ క్యాంప్‌పై దాడిలో


ఇతడి హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, మందుగుండును దశాకా మర్కజ్‌ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. అవసరమైనప్పుడు షకూర్‌ స్వయంగా


ఆయుధాలను తన వాహనంలో సియాల్‌కోట్‌కు తరలిస్తాడు. 2023 ఏప్రిల్‌ 20న పూంఛ్‌లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం.  పర్వత


యుద్ధతంత్రంలో శిక్షణ.. కోట్లిలోని మస్కర్‌ రహీల్‌ షహీద్‌. పీఓకేలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన స్థావరం ఇది. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీనిని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30


మంది వరకు ఉండొచ్చని అంచనా. తుపాకీల వినియోగం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు. దీంతోపాటు బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌, స్నైపింగ్‌ టెక్నిక్స్‌ నేర్పిస్తారు. ఉగ్ర విద్యార్థులను కొండల్లోకి


తీసుకెళ్లి.. పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు. హిజ్బుల్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ దీనికి అధిపతి. అతడే కొత్త ఉగ్రవాదులకు ఇక్కడ స్వాగతం పలుకుతాడని అంటారు. అంతేకాదు శిక్షణను కూడా అతడే


పర్యవేక్షిస్తాడు. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్‌లో నాలుగు గదులు, బ్యారక్‌లు ఉన్నాయి. వీటిలో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. వీటితోపాటు ఉగ్రవాదులకు బ్రెయిన్‌ వాష్‌


చేసేందుకు అవసరమైన ప్రచార సామగ్రి పెద్దఎత్తున ఇక్కడ నిల్వ చేస్తారు. లష్కరే శిక్షణ కేంద్రం.. ముజఫరాబాద్‌లోని షవాయ్‌ నాలా క్యాంప్‌. ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దీనికి హుజైఫా బిన్‌


యెమెన్‌, బైత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్‌లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్‌ లష్కరే క్యాంప్‌ ఉంది. ఈ ముఠాకు కీలకమైన


క్యాంప్‌ ఇది. లష్కరే కమాండర్‌ అబు దుజానా దీనికి ఇన్‌ఛార్జి. పెద్దఎత్తున లష్కరే క్యాడర్‌ ఇక్కడ నివాసం ఉంటోంది. వీరిలో కమాండర్లు, శిక్షకులు ఉన్నారు. లష్కరేలో చేరిన వారిని ఇక్కడ తరచూ హఫీజ్‌


సయీద్‌ వచ్చి ఆహ్వానం పలుకుతాడు. ఇక్కడ అత్యధికంగా 250 మందికి ట్రైనింగ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉంటారు. ఫిజికల్‌ శిక్షణతోపాటు.. జీపీఎస్‌ వాడటం, మ్యాప్‌ రీడింగ్‌,


ఆయుధ వినియోగం, ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వీరికి అవసరమైన ఆయుధాలను పాక్‌ సైన్యం సమకూరుస్తుంది. 26/11 ఉగ్ర


దాడుల్లో పాల్గొన్న కసబ్‌ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు. పాక్‌ ఎస్‌ఎస్‌జీ కమాండోలతో ట్రైనింగ్‌.. ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్‌ ఉగ్ర స్థావరం. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముఫ్తీ


అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ దీనికి అధిపతి. భారత్‌ నుంచి పారిపోయిన.. ఆసిక్‌ నెంగ్రూ, జైషే కమాండర్‌ అబ్దుల్‌ జిహాదీ ఈ క్యాంప్‌ను వాడుకొన్నారు. ముజఫరాబాద్‌ రెడ్‌ఫోర్ట్‌కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడికి


వచ్చేవారికి పాక్‌ ఎస్‌ఎస్‌జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్‌గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు


ఉంటారని సమాచారం.


Trending News

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

Dilruba: కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’.. విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) హీరోగా దర్శకుడు విశ్వకరుణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil...

Ipl2025: మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్‌కు తిరిగివచ్చేది అనుమానమే

దిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో తిరిగి ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇంటర...

Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులు

ధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...

Chandrababu: మార్కాపురంలో చంద్రబాబు పర్యటన.. మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించిన సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. మార్కాపురం...

Latests News

Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక..  మీ ప్రధానికి వెళ్ల...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (28-05-2025) మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముం...

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ. 33వేల కోట్ల పెట్టుబడులపై చర్చ

అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం కొనసాగుతోంది. 19 ప్రాజెక్టులకు సంబంధించిన ర...

Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని నరేంద్ర ...

Uggani recipe: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసేయండిలా!

Reported by: Published by: Last Updated:December 31, 2023 6:42 AM IST ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా? అయ...

Top