Ipl2025: మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్‌కు తిరిగివచ్చేది అనుమానమే

Eenadu

Ipl2025: మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్‌కు తిరిగివచ్చేది అనుమానమే"

Play all audios:

Loading...

దిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో తిరిగి ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) పేసర్‌,


ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ఐపీఎల్‌ 2025లో తిరిగి ఆడేది అనుమానమే. భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం


తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు తిరిగి మే 16 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌ పోరు మే 25 బదులుగా మే 30న జరగనున్నట్లు సమాచారం.  కానీ.. మిచెల్‌ స్టార్క్‌ ఇప్పటికే


సిడ్నీ చేరుకున్నాడు. ఐపీఎల్‌లో తిరిగి ఆడే విషయంపై లోకల్‌ మీడియాతో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు. బహుశా స్టార్క్‌ తిరిగి ఐపీఎల్‌ 2025లో పాల్గొనలేకపోవచ్చని మిచెల్‌ మేనేజర్‌ తర్వాత మీడియాతో


అన్నారు. అలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad)  ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్‌ కమిన్స్‌ (Pat Cummins), ట్రావిస్‌ హెడ్‌ (Travis Head) కూడా రాకపోవచ్చని సమాచారం. జూన్‌ 11 నుంచి


లార్డ్స్‌ మైదానంలో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో కూడా చాలామంది ఇప్పటికే స్వదేశం


చేరుకున్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్ల విషయంలోనూ ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది.  ఐపీఎల్‌ వాయిదా.. మంచి రిథమ్‌లో కనిపించిన ఆర్సీబీ (Royal Challengers Bengaluru) వంటి జట్లకు కాస్త ఇబ్బందిని


తెచ్చిపెట్టింది. కానీ కెప్టెన్ రజత్‌ పటీదార్‌కు (Rajat Patidar) మాత్రం కాస్త ఊరట కలిగించిందనే చెప్పొచ్చు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌


చేస్తున్నప్పుడు అతడి చేతి వేలికి గాయమైంది. ఐపీఎల్‌లో ప్రస్తుత విరామం అతడు తిరిగి కోలుకుని, మ్యాచుల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. ఈలోగా ఫిట్‌నెస్‌ సాధించి ప్లేఆఫ్స్‌లో పాల్గొనాలని రజత్‌


పటీదార్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతడు త్వరలో జరగనున్న ఇంగ్లాండ్‌ టూర్‌లో భాగంగా భారత్‌- ఎ తరఫున కూడా పాల్గొనాల్సి ఉంది.


Trending News

Chidambaram dikshitars call brahmotsavam protest contempt of court

The complaint added that several cases related to the Brahmotsavam of Sri Govindaraja Perumal Temple, including those fi...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Andhra cm naidu's house-warming event in kuppam today

CHITTOOR: Chief Minister and TDP supremo Nara Chandrababu Naidu, along with his wife Nara Bhuvaneshwari, will host a hou...

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Kaleshwaram overflows with devotion as thousands gather for saraswati pushkaralu

BHUPALPALLY: As the weekend aligned with the tenth day of the sacred Saraswati Pushkaralu, the serene village of Kaleshw...

Latests News

Ipl2025: మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్‌కు తిరిగివచ్చేది అనుమానమే

దిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో తిరిగి ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇంటర...

Ap bhavan: ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ.. సీఎం సూచనతో నిలిపివేత

అమరావతి: దిల్లీలోని ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఆక్రమణల తొలగింపు అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. 0.3...

Yoga asanas | latest yoga asanas - eenadu

ప్రశాంతతకు ధ్యాన ముద్ర... ఆధునిక జీవన విధానంలో పెద్దలే కాదు, చిన్నవాళ్లూ ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఫ...

Karun nair: నా ఇన్నింగ్స్‌కు విలువే లేదు: కరుణ్‌ నాయర్

Karun Nair: ఐపీఎల్ 2025 సీజన్‌లో డీసీ తొలి ఓటమిని చవిచూసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కరుణ్‌ నాయర్ సూపర్ ఇన్నింగ్స్‌ దిల్లీని ...

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... - bbc news తెలుగు

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... కథనం * రచయిత, సమీరాత్మజ్ మిశ్రా * ...

Top