Nara bhuvaneswari: ఈ తారకరామారావు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి: నారా భువనేశ్వరి

Eenadu

Nara bhuvaneswari: ఈ తారకరామారావు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి: నారా భువనేశ్వరి"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి (YVS Chowdary) కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం


తెలిసిందే. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.


ముఖ్య అతిథులుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. హీరోహీరోయిన్లపై భువనేశ్వరి క్లాప్‌ కొట్టి అభినందించారు. * చిరంజీవి, బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌


వేస్తే?.. ఎన్టీఆర్ ఏమన్నారంటే.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. 1980 నేపథ్యంలో రానుంది. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నారు. ఈ సినిమాతో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం


గురించి ప్రేక్షకులకు చెప్పనున్నట్లు వై.వి.ఎస్‌.చౌదరి తెలిపారు. ఈ సినిమాకు నేపథ్యమే బలమన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన కూచిపూడి డ్యాన్సర్‌, అచ్చతెలుగు అమ్మాయి వీణారావు నటిస్తున్నారు.


‘‘సీనియర్‌ ఎన్టీఆర్‌ ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నాను. తన ఉనికిని చాటుకోవడం కోసం రామ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఆ తపన ఉన్నవారంతా కచ్చితంగా పేరు సొంతం


చేసుకుంటారు’’ - భువనేశ్వరి ‘‘నాన్నకు(సీనియర్‌ ఎన్టీఆర్‌) ఎవరూ సాటి రారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన కుమారులు, మనవళ్లు ఎంతో కృషి చేస్తున్నారు. వారంతా కూడా స్టార్‌లుగా


ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆయన మునిమనవడు ఇండస్ట్రీలోకి రానున్నాడు. మీడియా ప్రోత్సాహం అతడికి చాలా అవసరం. అందరూ తారక రామారావును అభినందించండి. వైవీఎస్‌ చౌదరీకి కృతజ్ఞతలు’’ - లోకేశ్వరి ‘‘ఈరోజు


నందమూరి కుటుంబం నుంచి మరో తరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కళాకారుడు ఎంతో తపస్సు చేయాలి. కళామతల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నతశిఖరాలు అధిరోహిస్తాడు. మా నాన్న ఒక కళాతపస్వీ. ఆయన క్రమశిక్షణతో


చలనచిత్ర రంగానికి  తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారు. తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ కూడా చలనచిత్ర రంగంపై చెదరని ముద్ర వేశారు. ఆ


తర్వాత తరం కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ కూడా అంకితభావంతో తమ ఉనికికి చాటుకున్నారు. అలానే ఇప్పుడు మరో తరం పరిశ్రమలోకి వస్తోంది. మేమంతా రామ్‌ అని పిలుచుకునే ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.


అతడికి కూడా కళామతల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబసభ్యుల ఆశీస్సులూ ఉంటాయి. వైవీఎస్‌ చౌదరికి అభినందనలు’’ - పురందేశ్వరి


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Unni mukundan: నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్‌ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్‌

తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మేనేజర్‌ విపిన్‌ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు. విపిన్‌ ఫిర్యాదుపై ...

Nara bhuvaneswari: ఈ తారకరామారావు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి: నారా భువనేశ్వరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా వై.వి....

Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్‌ తెలిపి...

Latests News

Gautam gambhir: రోహిత్‌, కోహ్లి హఠాత్తు రిటైర్మెంట్‌.. గంభీర్‌ పాత్ర ఉందా?

రోహిత్, కోహ్లి హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంలో కోచ్‌ గంభీర్‌ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈనాడు క...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Donald trump: భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌

భారత్‌, పాక్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్‌ తాజాగా సూచించారు. ఇరు దేశాలు తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి సహాయం...

మోస్ట్ పాపులర్ హీరోయిన్.. 12మందితో ఎఫైర్.. అతనితో పెళ్లి.. చివరికి ఒంటరిగా

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Top