Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ

Eenadu

Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ"

Play all audios:

Loading...

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్‌ తెలిపింది. WhatsApp | ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్షణ సందేశం పంపాలన్నా, ఫొటోలు


పంచుకోవాలన్నా వెంటనే గుర్తుకువచ్చే మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ (WhatsApp). ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుందీ యాప్‌. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా


తీసుకొచ్చిన వాయిస్‌ చాట్స్‌ (voice chats) ఫీచర్‌ని తాజాగా విస్తరించింది. ఇప్పటివరకు ఎక్కువ సభ్యులున్న గ్రూపులకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అన్ని గ్రూపులకు జోడించింది. వాట్సప్‌ తొలుత 


వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను 33 మందికి పైబడి సభ్యులున్న గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తాజాగా


తెలిపింది. గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. గ్రూప్‌ చాట్‌ ఓపెన్‌ చేసి కింద నుంచి స్వైప్‌ చేస్తే Swipe up to chat అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని కొన్ని


సెకన్ల పాటు హోల్డ్‌ చేస్తే వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ ఎనేబల్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సభ్యులందరికీ రానున్న వారాల్లో


వినియోగంలోకి రానుంది. * 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ సాధారణంగా ఉండే గ్రూప్‌ కాల్స్‌కు ఈ ఫీచర్‌ కాస్త భిన్నం. వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు


రింగ్‌టోన్‌ వస్తుంది. కానీ ఈ ఫీచర్‌ సాయంతో వాట్సప్‌ నుంచి గ్రూప్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి రింగ్‌ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే స్క్రీన్‌పై


ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్‌ చాట్‌లో పాల్గొనాలనుకొనేవారు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు. వాయిస్‌ చాట్‌లో పాల్గోని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడొచ్చు.


అంతేకాదు ఇందులో వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో తీసుకొచ్చింది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

Latests News

Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్‌ తెలిపి...

Easemytrip vs makemytrip: మేక్‌మైట్రిప్‌కు చైనాతో సంబంధాలు: ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు

EaseMyTrip vs MakeMyTrip: మేక్‌మైట్రిప్‌పై ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిట్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ బోర...

Itr-3 form: అందుబాటులోకి ఐటీఆర్‌-3 ఫారమ్‌.. ఎవరు, ఎలా ఫైల్‌ చేయాలో తెలుసుకోండి..

* ITR-3 ఫారమ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? - ముందు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ https://www.incometaxindiaefiling....

Rakesh poojary: మిత్రమా.. మళ్లీ జన్మించు: ‘కాంతార 2’ నటుడి మృతిపై రిషబ్‌శెట్టి

నటుడు రాకేశ్‌ పూజారి (34) (Rakesh Poojary) మృతి పట్ల ‘కాంతార 2’ (Kantara 2) హీరో రిషబ్‌శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్...

వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్‌ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...

Top