Easemytrip vs makemytrip: మేక్‌మైట్రిప్‌కు చైనాతో సంబంధాలు: ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు
Easemytrip vs makemytrip: మేక్‌మైట్రిప్‌కు చైనాతో సంబంధాలు: ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు"
Play all audios:
EaseMyTrip vs MakeMyTrip: మేక్‌మైట్రిప్‌పై ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ బోర్డులో చైనా వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. EaseMyTrip vs MakeMyTrip |
దిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కొన్ని దేశాల నిజస్వరూపం బయటపడింది. ముఖ్యంగా తుర్కియే, అజర్బైజాన్ దేశాలపై దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఆయా దేశాల ఉత్పత్తులు
బహిష్కరించడంతో పాటు ఆ దేశాలకు పర్యటనలను కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నిశాంత్ పిట్టీ తన ప్రత్యర్థి మేక్‌మైట్రిప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ
సంస్థ 10 మంది డైరెక్టర్ల బోర్డులో ఐదుగురు చైనా వ్యక్తులని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాయ్‌కాట్ ట్రెండ్ ప్రారంభమైన వేళ తొలుత నిశాంత్ బుధవారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్
పెట్టారు. ‘‘చైనా యాజమాన్యంలోని ఓ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత సాయుధ దళాలు డిస్కౌంట్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. డిఫెన్స్ ఐడీ, రూట్, తేదీ వంటి వివరాలను అందిస్తున్నారు. దీనివల్ల మన
శత్రువులకు మన సైనికులు ఎక్కడికి వెళుతున్నారో తెలుస్తోంది. ఈ లూప్‌హోల్‌ను వెంటనే సరిదిద్దాలి’’ అని నిశాంత్ పోస్ట్ చేశారు. అందులో మేక్ మై ట్రిప్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా సంబంధిత
స్క్రీన్షాట్లను మాత్రమే పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలను మేక్మైట్రిప్ ఖండించింది. తమది భారతీయ కంపెనీ అని, ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేస్తున్నామని వివరణ ఇచ్చింది. డేటా ప్రైవసీ చట్టాలకు కట్టుబడి
ఉన్నామని తెలిపింది. తమపై వస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవిగా ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ తాజాగా మరో పోస్ట్ చేశారు. ఈ సారి నేరుగా మేక్మైట్రిప్ పేరును
ప్రస్తావిస్తూ.. బోర్డులోని 10 మందిలో ఐదుగురికి చైనాతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. నాలుగు వ్యూహాత్మక బోర్డు కమిటీల్లో మూడు చైనీస్ అనుబంధం కలిగిన డైరెక్టర్లు నాయకత్వం వహిస్తున్నారని
ఆరోపించారు. చైనా వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. మే 14న కొత్త డైరెక్టర్ నియామకం చేపట్టినంత మాత్రన చైనా మూలాలను చెరిపేయలేరంటూ తప్పుబట్టారు. జాతీయ భద్రత
విషయంలో మౌనం తగదని నిశాంత్ వ్యాఖ్యానించారు. తాజా ఆరోపణలపై మేక్ మై ట్రిప్ స్పందించలేదు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Latests News
Taylor swift: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్ కిల్లర్ ప్రమేయంఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని (US) న్యూ ఇంగ్లాండ్ రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ సీరియల్ కిల్లర్ దారుణ హత్యలకు పాల్...
Sarileru neekevvaru | telugu movie news - times of indiaTitle: Sarileru Neekevvaru Language: Telugu Cast: Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi Release Date: January 11...
Gita gopinath: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్Gita Gopinath ఇంటర్నెట్‌డెస్క్: భారత్ ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్...
Rahul gandhi: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్ గాంధీచార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాం...
Gummadi sandhya rani | latest gummadi sandhya rani - eenaduదాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సంధ్యారాణి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతలకు అధిక ప్రా...