Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలు

Eenadu

Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలు"

Play all audios:

Loading...

జాన్వీకపూర్‌ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్‌ చేశారని అన్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌: జాన్వీ కపూర్‌ (Jahnvi kapoor), ఇషాన్‌


ఖట్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్‌’ (Homebound). నీరజ్‌ ఘయ్వాన్‌ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా దర్శకుడు నీరజ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.


జాన్వీకపూర్‌ ఇప్పటివరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సినిమా విడుదలయ్యాక ఆమెకు ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడిందని చెప్పారు. ‘‘జాన్వీకపూర్‌ ఇప్పటివరకూ


ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె నటనను ఉద్దేశించి చాలామంది ట్రోల్స్‌ చేశారు. కానీ, ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తారు. ఆమెలోని నిజమైన నటిని గుర్తిస్తారు. ఆమె


సామర్థ్యాన్ని తెలుసుకుంటారు’’ అని నీరజ్‌ తెలిపారు. ‘‘ఈ సినిమా కోసం జాన్వీకపూర్‌ను ఎంచుకోవాలని ముందునుంచే అనుకున్నాను. ఆమెకు కథ చెప్పగానే ఎంతో నచ్చేసింది. మా టీమ్‌లో భాగమయ్యేందుకు


అంగీకరించింది. అయితే, ఇదొక సీరియస్‌ స్టోరీ. సామాజిక-రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ కథపై మరింత పట్టు రావడం కోసం అంబేడ్కర్‌ రచించిన ‘ది యానిహిలేషన్‌ ఆఫ్‌ కాస్ట్‌’ పుస్తకాన్ని ఆమెకు అందించాను.


కథను పూర్తిగా అర్థం చేసుకున్న ఆమె పాత్రలో ఒదిగిపోయింది’’ అని ఆయన వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) జాన్వీకపూర్‌ కెరీర్‌ గురించి మాట్లాడారు.


ఆమె ఎదుగుదల చూస్తుంటే తనకు ఒక థెరపీలా ఉందని వెల్లడించారు. * నుదుటిన ‘సిందూరం’తో.. కేన్స్‌లో ఐశ్వర్య పవర్‌ఫుల్‌ లుక్‌ జాన్వీకపూర్‌, ఇషాన్‌ కలిసి నటించిన రెండో చిత్రమిది. వీరిద్దరి కాంబోలో


వచ్చిన తొలి చిత్రం ‘ధడక్‌’. ‘హోమ్‌బౌండ్‌’ విషయానికి వస్తే.. సామాజిక - రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమైంది. ఓ మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు.. సమాజంలో గౌరవ మర్యాదలను పొందడం కోసం


పోలీసు ఉద్యోగాన్ని సాధించాలనుకుంటారు. ఈక్రమంలోనే వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల వల్ల వారి మధ్య అనుబంధం దెబ్బతింటుంది. చివరకు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారా? లేదా? అనేది


ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. 9 నిమిషాల పాటు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కించుకుంది.


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Rajendra prasad: థియేటర్ల బంద్‌.. ఎవరో మిస్‌ గైడ్‌ చేశారు: రాజేంద్రప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్‌ల బంద్‌ చిన్న విషయం కాదన్నారు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad). తన తాజా చిత...

Ap dsc hall tickets: ఏపీలో వాట్సప్‌ ద్వారా మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లు

ఏపీలో మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. వాట్సప్‌ ద్వారా  హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. AP...

Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenadu

యాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...

Latests News

Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలు

జాన్వీకపూర్‌ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్‌ చేశారని అ...

Realme gt 7: రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..

Realme GT 7 | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ మిడ్‌ రేంజ్‌లో జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది...

Mumbai rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు..

Mumbai rainfall ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ...

Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న ...

Ace movie review: రివ్యూ: ఏస్‌.. విజయ్‌ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?

చిత్రం: ఏస్‌; నటీనటులు: విజయ్‌ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్‌ అవినాష్‌ తదితరులు; సం...

Top