Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..
Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు.."
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హత్య
బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా తెలిపారు. ఆ సందేశాల స్క్రీన్ షాట్‌లను పంచుకుంటూ.. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నేను కామెంట్ సెక్షన్ ఆఫ్
చేయలేదు. ఎటూ పారిపోలేదు. మీ అందరి నుంచి ఏ విషయాన్నీ దాచడం లేదు. నా చర్యలను ప్రశ్నించే హక్కు మీ అందరికీ ఉంది. నాకు సంబంధించిన ఏ విషయమైనా నేరుగా నా ముఖంపైనే చెప్పండి. నా వెర్షన్‌ను
వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్టూ జరుగుతోన్న కొన్ని విషయాలకు నేను బాధ్యురాలిని అని మీరంతా భావిస్తే.. నన్ను కోర్టు ముందు
హాజరుపరచండి’’. * విడాకుల కేసు.. నెలకు రూ.40 లక్షల భరణం కోరిన జయం రవి భార్య ‘‘మీ అందరి శాపాలు, బాధ పెట్టే మాటల వల్ల నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో మీలో ఎవరైనా ఆలోచించారా? కర్మ ఎవరినీ
విడిచిపెట్టదు అని మీరంతా నిందిస్తున్నారు. కానీ, నిజం బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధనే అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి దారుణమైన మాటలతో నన్ను
సులభంగా నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా
ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’’ అని రాసుకొచ్చారు. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్టు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. తనను సంప్రదించకుండానే రవి
విడాకుల విషయం బయటపెట్టారంటూ ఆర్తి ఆరోపించారు. గాయని కెనీషాతో రవి స్నేహపూర్వంగా ఉంటున్నారని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. అలాగే తాము వేర్వేరుగా ఉండడానికి
మూడో వ్యక్తే కారణమని.. తన వద్ద తగిన ఆధారాలున్నాయని ఆర్తి ఇటీవల పేర్కొన్నారు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay...
Aamir khan: అనుకోకుండా కలిసి ప్రేమికులమయ్యాం: ఆమిర్ ఖాన్ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇటీవల తన ప్రేమ సంగతి వెల్లడించిన విషయం తెలిసిందే...
Rishad premji pay: విప్రో ఛైర్మన్, సీఈఓ పారితోషికం ఎంతో తెలుసా?Wipro Chairman pay | దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరంల...
Latests News
Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..ఇంటర్నెట్ డెస్క్: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న ...
Ace movie review: రివ్యూ: ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?చిత్రం: ఏస్; నటీనటులు: విజయ్ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్ అవినాష్ తదితరులు; సం...
Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబువైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్క...
Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టుసూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అర...
Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంగిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢ...