Ace movie review: రివ్యూ: ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?
Ace movie review: రివ్యూ: ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?"
Play all audios:
చిత్రం: ఏస్; నటీనటులు: విజయ్ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్ అవినాష్ తదితరులు; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్; నేపథ్య సంగీతం: సామ్ సీఎస్; ఛాయాగ్రహణం:
కరణ్ బి.రౌత్; రచన, దర్శకత్వం: అరుముగ కుమార్; నిర్మాణ సంస్థ: 7 సీఎస్ ఎంటర్టైన్మెంట్; విడుదల తేదీ: 23-05-2025. వైవిధ్యభరితమైన కథలు.. విలక్షణమైన పాత్రలతో అలరిస్తూ సినీ ప్రియుల్లో
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). గతేడాది ‘మహారాజ’తో తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘ఏస్’ (Ace)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ
సినిమా ఎలాంటి అనుభూతి అందించింది? విజయ్ సేతుపతికి మరో విజయాన్ని అందించిందా? కథేంటంటే: ఓ నేరం చేసి కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఉద్యోగం కోసం మలేసియాకు
వెళతాడు. జ్ఞానానందం (యోగిబాబు) సాయంతో కల్పన (దివ్య పిళ్లై) రెస్టరంట్లో వంటవాడిగా చేరతాడు. ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో రుక్కు అలియాస్ రుక్మిణి (రుక్మిణీ వసంత్) కాశీ ప్రేమలో పడుతుంది.
ఆమెకు సాయం చేసేందుకు స్థానిక డాన్ ధర్మ (బీఎస్ అవినాష్) క్లబ్లో జూదం ఆడతాడు. తొలుత డబ్బులు గెలుచుకున్నా.. ధర్మ మోసం వల్ల కాశీ రూ.2 కోట్లు వరకు బాకీ పడతాడు. డబ్బులు చెల్లించకపోతే మీ
ప్రాణాలు తీస్తానని ధర్మ వార్నింగ్ ఇస్తాడు. ఈ గండం నుంచి గట్టేక్కేందుకు కాశీ బ్యాంక్ దొంగతనానికి పాల్పడతాడు. తర్వాత ఏమైంది? ఈ కేసులో పోలీసులకు చిక్కాడా? పోలీసుల్ని, ధర్మ గ్యాంగ్‌ను కాశీ ఎలా
ఎదుర్కొన్నాడు? అన్నది కథ (Ace Movie Story). ఎలా సాగిందంటే: విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబోపై నమ్మకం పెట్టుకొని తీసిన రొటీన్ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే దర్శకుడి రైటింగ్..
టేకింగ్‌లో కొత్తదనం లేదు. విజయ్ సేతుపతి సినిమా అనగానే కథలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకుల్లో నమ్మకం. ఈ చిత్రం విషయంలో అదీ కొరవడింది. ప్రథమార్ధమంతా సాగదీత ధోరణిలోనే ఉంటుంది. విజయ్
పరిచయ సన్నివేశాలు.. అతని బాస్‌గా జ్ఞానానందం పాత్రలో యోగిబాబు హంగామా కాలక్షేపాన్నిస్తాయి. రుక్మిణి కథలోకి ఎంట్రీ ఇచ్చాక సినిమా కాసేపు రొమాంటిక్ ఫార్మాట్లోకి వెళ్తుంది. ధర్మ క్లబ్‌కు వెళ్లి
జూదం ఆడి సమస్యల్లో చిక్కుకోవడంతో కథలో వేగం పుంజుకుంటుంది. కాశీ దొంగతనం కోసం రంగంలోకి దిగడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అయితే, థ్రిల్ పంచేలా చూపించాల్సిన బ్యాంక్ దోపిడీ ఎపిసోడ్‌ను దర్శకుడు
పేలవంగా తీర్చిదిద్దారు. విరామ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి (Ace Movie Review). ద్వితీయార్ధం కాస్త థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ధర్మ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు కాశీ, జ్ఞానానందం వేసే
ఎత్తులు అక్కడక్కడా నవ్వులు పూయిస్తాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమం ఆసక్తి రేకెత్తిస్తుంది. రుక్మిణి సవతి తండ్రి రాజ దొరై.. బోల్ట్ కాశీకి మధ్య వచ్చే ట్రాక్ కథను రసవత్తరంగా మారుస్తుంది.
చివరి 20 నిమిషాల ప్రీ క్లైమాక్స్ అలరిస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహలకు తగ్గట్లుగా ఉన్నా ఫర్వాలేదనిపిస్తుంది (Ace Movie Review In Telugu). ఎవరెలా చేశారంటే: బోల్ట్ కాశీ పాత్రలో విజయ్
సేతుపతి ఒదిగిపోయారు. నటుడిగా విజయ్‌కు సవాల్ విసిరే అంశాలేవీ ఆ పాత్రలో లేకున్నా.. కథను తన భుజాలపై మోశారు. రుక్మిణి పాత్ర కథకు కీలకమైనా.. నటన పరంగా ప్రతిభ చూపించేందుకు ఆమెకి ఆస్కారం దొరకలేదు.
జ్ఞానానందంగా యోగిబాబు వీలు చిక్కినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు. సైకో పాత్రలో పృథ్వీరాజ్ నటన ఆకట్టుకుంటుంది. బీవీఎస్ అవినాష్, దివ్య పిళ్లై పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. కథలో కొత్తదనం
లేదు. స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉంది. కత్తెరకు పని చెప్పే సన్నివేశాలు ప్రథమార్ధంలో చాలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం కథకు బలాన్నిచ్చింది.
మలేసియాలో తీయడం వల్ల సినిమాకి గ్రాండ్ లుక్ వచ్చింది. ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. * బలాలు * + విజయ్ సేతుపతి, యోగిబాబు * + ద్వితీయార్ధంలోని కొన్ని
థ్రిల్లింగ్ మూమెంట్స్ * బలహీనతలు * - కొత్తదనం లేని కథ * - ఊహకు అందే కథనం * - ప్రథమార్ధం సాగదీత * చివరిగా: ఏస్.. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ (Ace Movie Review)! * గమనిక: ఈ సమీక్ష
సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay...
Aamir khan: అనుకోకుండా కలిసి ప్రేమికులమయ్యాం: ఆమిర్ ఖాన్ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇటీవల తన ప్రేమ సంగతి వెల్లడించిన విషయం తెలిసిందే...
Rishad premji pay: విప్రో ఛైర్మన్, సీఈఓ పారితోషికం ఎంతో తెలుసా?Wipro Chairman pay | దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరంల...
Latests News
Ace movie review: రివ్యూ: ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?చిత్రం: ఏస్; నటీనటులు: విజయ్ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్ అవినాష్ తదితరులు; సం...
Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబువైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్క...
Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టుసూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అర...
Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంగిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢ...
Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచనవాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ:...