Realme gt 7: రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
Realme gt 7: రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే.."
Play all audios:
Realme GT 7 | ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ మిడ్ రేంజ్‌లో జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది తీసుకొచ్చిన జీటీ 6కి కొనసాగింపుగా.. జీటీ 7, జీటీ 7టీ ఫోన్లను
తాజాగా విడుదల చేసింది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సదుపాయాలతో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. వీటితో పాటు ఆస్టిన్ మార్టిన్ ఎఫ్1 టీమ్‌తో కలిసి కొత్తగా జీటీ7 డ్రీమ్
ఎడిషన్‌ను లాంచ్ చేశారు. రియల్‌మీ జీటీ7 వివరాలు రియల్‌మీ జీటీ7 6.78 అంగుళాల ఎల్‌టీపీఎస్ అమోలెడ్ 1.5k డిస్‌ప్లేతో వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేటు ఉంది. ఆండ్రాయిడ్ 15తో పనిచేసే రియల్‌మీ యూఐ
6.0తో పనిచేస్తుంది. 6000 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400ఈ చిప్‌సెట్ అమర్చారు. 7,700 ఎంఎం వ్యాపర్
ఛాంబర్ కూలింగ్ సెటప్‌ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 906 ప్రధాన కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉంది. ఏఐ గ్లేర్
రిమూవల్, ఏఐ ల్యాండ్‌స్కేప్+, ఏఐ ట్రాన్సలేటర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మీ జీటీ 7 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది.
12జీబీ+256జీబీ వేరియంట్ రూ.42,999, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.46,999 కంపెనీ పేర్కొంది. ఐస్‌సెన్స్ బ్లాక్, ఐస్ సెన్స్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. రియల్‌మీ జీటీ7టీ వివరాలు రియల్‌మీ జీటీ
7 తరహాలోనే సాఫ్ట్‌వేర్, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ వంటివి జీటీ 7టీలోనూ ఇచ్చారు. ఇది 6.68 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఇది కూడా 1.5k రిజల్యూషన్‌తో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు ఉంది.
మీడియాటెక్ డైమెన్‌సిటీ 8,400 మ్యాక్స్ ప్రాసెసర్ అమర్చారు. డ్యూయల్ కెమెరా ఉంది. 50 ఎంపీ సోనీ ఐంఎఎక్స్ 896 ప్రధాన కెమెరాతో పాటు 8 ఎంపీఈ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 32 ఎంపీ
ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.34,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.37,999, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర
రూ.41,999గా కంపెనీ పేర్కొంది. ఐస్‌సెన్స్ బ్లాక్, ఐస్‌సెన్స్ బ్లూ, రేసింగ్ యెల్లో రంగుల్లో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో జీటీ7ను రూ.34,999కు, జీటీ 7టీని రూ.28,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు
చేయొచ్చు. ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయి. మే 30 నుంచి అమెజాన్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యమవుతాయి. * రియల్‌మీ 7 డ్రీమ్ ఎడిషన్: ఇది 16జీబీ+512జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధరను
రూ.49,999గా కంపెనీ పేర్కొంది. జూన్ 13 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయి. జీటీ7లోని ఫీచర్లే దీనిలోనూ ఉన్నాయి.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రంEPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...
Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenaduయాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...
Sheikh hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో నేరాభియోగం నమోదు..Sheikh Hasina ఇంటర్నెట్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు ...
Latests News
Realme gt 7: రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..Realme GT 7 | ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ మిడ్ రేంజ్‌లో జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది...
Mumbai rainfall: ముంబయిలో రెడ్ అలర్ట్: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు..Mumbai rainfall ఇంటర్నెట్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ...
Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..ఇంటర్నెట్ డెస్క్: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న ...
Ace movie review: రివ్యూ: ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?చిత్రం: ఏస్; నటీనటులు: విజయ్ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్ అవినాష్ తదితరులు; సం...
Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబువైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్క...