Mumbai rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు..

Eenadu

Mumbai rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు.."

Play all audios:

Loading...

Mumbai rainfall ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 సమయానికి బీఎంసీ పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200


మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ ముంబయి వానల ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం ఐఎండీ ముంబయి, థానే, రాయగడ్‌, రత్నగిరి ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ


ప్రాంతాలతో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది. బీఎంసీ పరిధిలో ఉదయం 11 గంటల నాటికి


నారిమన్‌పాయింట్‌ స్టేషన్‌ (252 మి.మి.), బైకుల్లా ఈవార్డ్‌ (213మి.మి.), కొలాబా (207మి.మి.), డు టకి స్టేషన్‌ (202మి.మి.), మెరైన్ లైన్స్‌, చందన్‌వాడీ (180 మి.మి.), మెమోన్‌వాడ (183 మి.మి.),


వర్లీ (171 మి.మి.) వర్షపాతం నమోదైంది. నేటి ఉదయం కొలాబాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.   ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 295 మి.మి. గా నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన


అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మి.మిగా నమోదైంది. కానీ, ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది. ఈ సారి మహారాష్ట్రలో పది రోజుల ముందుగానే.. నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా


జూన్‌ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 తర్వాత సీజన్‌ కంటే ఇంత ముందుగా ముంబయిలో వర్షాలు పడటం ఇదే తొలిసారి.


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్‌ విషయంలో సారీ: మంచు మనోజ్‌

హైదరాబాద్‌: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్‌పై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...

Sheikh hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానిపై మరో నేరాభియోగం నమోదు..

Sheikh Hasina ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు ...

Aamir khan: అనుకోకుండా కలిసి ప్రేమికులమయ్యాం: ఆమిర్‌ ఖాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ఇటీవల తన ప్రేమ సంగతి వెల్లడించిన విషయం తెలిసిందే...

Latests News

Mumbai rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు..

Mumbai rainfall ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ...

Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న ...

Ace movie review: రివ్యూ: ఏస్‌.. విజయ్‌ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?

చిత్రం: ఏస్‌; నటీనటులు: విజయ్‌ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్‌ అవినాష్‌ తదితరులు; సం...

Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు

వైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకావిష్క...

Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

సూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అర...

Top