Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం"
Play all audios:
EPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డు
ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై
చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. బ్యాలెన్స్ చెక్ ఇలా.. * పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం
ఉమాంగ్ యాప్‌ను సందర్శించొచ్చు. రిజస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాక యాప్‌లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళితే యూఏఎన్, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆపై బ్యాలెన్స్, పాస్‌బుక్ వంటి
వివరాలు కనిపిస్తాయి. * ఈపీఎఫ్ఓ పోర్టల్ WWW.EPFINDIA.GOV.IN వెబ్సైట్లోకి వెళ్లి యూఏఎన్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెంబర్ పాస్‌బుక్‌ను ఎంపిక చేసుకుని వివరాలు పొందొచ్చు. * మీ
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది.
కాసేపటి తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. * ఎస్సెమ్మెస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్‌తో లింక్ అయిన మొబైల్ నుంచి 77382 99899 నంబర్‌కు EPFOHO ‘UAN’ అని మెసేజ్
చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ పొందొచ్చు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం.....
Ed raids: అన్ని హద్దులూ దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీం సీరియస్ED Raids: సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని, అది సోదాల విషయంలో అన్ని హద్దులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది...
Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్’కు సిసలైన అర్థం నేహా భండారిజమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...
Srisailam: ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం.. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్షశ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్...
Latests News
Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రంEPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...
Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్హైదరాబాద్: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్‌పై నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...
Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఐసీఎంఆర్ చీఫ్ ఏమన్నారంటే?దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, త...