Harvard: ట్రంప్‌ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలంటూ ప్రచారం

Eenadu

Harvard: ట్రంప్‌ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలంటూ ప్రచారం"

Play all audios:

Loading...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇంటర్నెట్‌


డెస్క్: హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University) బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా  విదేశీ విద్యార్థులను


చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్‌ కుమారుడు బారన్‌కు (Barron) ఆ విశ్వ విద్యాలయంలో సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు


పాల్పడుతున్నారని ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ట్రంప్‌ చిన్న కుమారుడు బారన్‌కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో న్యూయార్క్‌ యూనివర్సిటీ (NYU)


స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ చదవడానికి అడ్మిషన్‌ తీసుకున్నట్లు పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama) కుమార్తె మలియాకు యూనివర్సిటీలో


సీటు ఇచ్చిన హార్వర్డ్‌.. బారన్‌కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్‌ ఈ చర్యలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. కాగా, ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్


విశ్వవిద్యాలయం ఖండించింది. బారన్‌పై వస్తున్న వార్తలపై డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా (Melania Trump)  కార్యాలయం స్పందిస్తూ.. అతడు అసలు హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదని వివరణ ఇచ్చింది.  *


హార్వర్డ్‌పై పోరులో విజయం సాధిస్తాం: ట్రంప్‌ ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీ నిధుల్లో ట్రంప్ కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని


రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విశ్వవిద్యాలయంం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ


చేశారు. కాగా.. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని ట్రంప్‌ తెలిపారు. ఆయా దేశాలు విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడంలేదని వ్యాఖ్యానించారు. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Latests News

Harvard: ట్రంప్‌ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలంటూ ప్రచారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుత...

Acb: ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు: విజయ్‌కుమార్‌

అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులమని ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డైరెక్టర్ విజయ...

Rajat patidar: ‘ఇంకా ఒక్క మ్యాచే ఉంది.. కలిసి సంబరాలు చేసుకుందాం’: ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ మెసేజ్

పంజాబ్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానుల...

Polycet 2025 results: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు రేపే.. రిజల్ట్స్‌ ఈనాడు. నెట్‌లో చూడొచ్చు

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్‌(TG Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్...

Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఖరీదైన ఆటగాడు, వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) ఈ సీజన్‌ల...

Top