Emmanuel macron: మెక్రాన్ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్.. రష్యా వెటకారం..
Emmanuel macron: మెక్రాన్ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్.. రష్యా వెటకారం.."
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రష్యా
మీడియా ఈ క్లిప్‌ను పదేపదే ప్రసారం చేసింది. ఈ దంపతులు చిర్రుబుర్రులాటపై రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా వెటకారంగా స్పందించారు. ‘‘ప్రథమ మహిళ తన భర్త చెంపమీద మెల్లగా తట్టి
ఉత్సాహపరచాలనుకొంటే.. అనుకోకుండా చేయి వేగంగా వచ్చి ఉంటుందా..? కాలర్ సరిచేసే క్రమంలో పొరబాటున తన ప్రియమైన వ్యక్తి ముఖంపై చేయి తగిలిందా..? దీన్ని కవర్ చేయడానికి మెక్రాన్ సలహాదారులు
క్రెమ్లిన్ హస్తం ఉందంటారేమో..?’’ అని ఎద్దేవా చేశారు. ఈ క్లిప్‌పై మెక్రాన్ స్పందించారు. ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, అది తమ మధ్య
జరిగిన సరదా సన్నివేశమని అన్నారు. దీని చుట్టూ స్టోరీలు అల్లడంపై మండిపడ్డారు. ‘‘ఆ వీడియోల్లో నేను ఒక టిష్యూ తీసుకున్నాను. ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో జోక్ చేశాను. ఇది మా మధ్య
ఎప్పుడూ జరిగేదే’’ అని వివరణ ఇచ్చారు. మెక్రాన్-బ్రిగెట్టా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని సోమవారం ఫ్రెంచ్ మీడియాలో వార్తలొచ్చాయి. వారి విమానం ఆదివారం వియత్నాం రాజధాని హనోయ్‌లో దిగింది.
తలుపును ఒక అధికారి తెరచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్‌ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కు జరిగారు.
ఈ దృశ్యం రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకుని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి
మెక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి ఎర్ర తివాచీ మీద పక్కపక్కనే నడిచారు. ఇక 47 ఏళ్ల మెక్రాన్, 72 ఏళ్ల బ్రిగెట్టా ప్రేమకథ గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీAlcatel V3 series | ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ అల్కాటెల్ కొత్త మొబైల్స్‌ను భారత మార్కెట్...
Rajendra prasad: థియేటర్ల బంద్.. ఎవరో మిస్ గైడ్ చేశారు: రాజేంద్రప్రసాద్ఇంటర్నెట్ డెస్క్: థియేటర్‌ల బంద్ చిన్న విషయం కాదన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). తన తాజా చిత...
Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రంEPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...
Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్హైదరాబాద్: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్‌పై నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...
Latests News
Emmanuel macron: మెక్రాన్ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్.. రష్యా వెటకారం..ఇంటర్నెట్‌డెస్క్: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్...
Alia bhatt: ముగిసిన కేన్స్ ఉత్సవం.. గూచి చీరలో మెరిసిన అలియాఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Ca...
Operation sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్షం.. యూసఫ్ ఔట్.. అభిషేక్ బెనర్జీ ఇన్పాక్ చర్యలను ఎండగట్టడానికి విదేశాలకు పంపే భారత బృందంలో టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన...
delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naiduniadelhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...
Covid 19: ఆ కొవిడ్ పేషంట్‌ను చంపేయ్.. ఓ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కకావికలం చేసిన సంగతి తెలిసిం...