Harvard university: హార్వర్డ్‌పై ట్రంప్ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులు
Harvard university: హార్వర్డ్‌పై ట్రంప్ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులు"
Play all audios:
వాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని ట్రంప్ సర్కారు
రద్దు చేసింది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు (Indian Students) సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే. లేదంటే అమెరికాలో
చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద
విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో
6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27శాతం మంది విదేశీయులు. వీరిలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉన్నారు. ఇక భారత్ నుంచి
788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో వీరందరి భవితవ్యం గందరగోళంలో పడింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాల రద్దు 2025-26 విద్యా
సంవత్సరం నుంచి వర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా.. ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్‌తో
డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్‌గా బయటకు రావొచ్చు. కానీ, ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం.. తప్పనిసరిగా మరో ఇనిస్టిట్యూట్‌కు మారాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధమైన
హోదాను కోల్పోతారు. 72 గంటల గడువు.. 6 కండీషన్స్: విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్‌కు ఉన్న అనుమతులను రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS)
సెక్రటరీ క్రిస్టి నోయెమ్ లేఖ రాశారు. అయితే, ఈ హోదాను పునరుద్ధరించుకునేందుకు హార్వర్డ్‌కు ఓ అవకాశం కల్పించారు. 72 గంటల్లోనే తమ ఆరు డిమాండ్లను అంగీకరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అవేంటంటే..
1. గత ఐదేళ్లలో హార్వర్డ్‌లో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట జరిపిన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ సమర్పించాలి. 2. గత ఐదేళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు
పాల్పడిన ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలి. 3. నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు.. ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డులను
సమర్పించాలి. 4. వలసేతర విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆ వివరాలు అందించాలి. 5. గత ఐదేళ్లలో హార్వర్డ్‌లో నమోదుచేసుకున్న వలసేతర విద్యార్థుల
క్రమశిక్షణ రికార్డులను ఇవ్వాలి. 6. క్యాంపస్‌లో వలసేతర విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఆడియో, వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వానికి సమర్పించాలని క్రిస్టి నోయెమ్ ఆదేశించారు. ఇది చట్టవ్యతిరేకం:
హార్వర్డ్ తాజా నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ స్పందించింది. ఇది చట్టవ్యతిరేకమని, యూనివర్సిటీకి తీవ్ర హాని చేస్తుందని పేర్కొంది. దీనిపై తాము తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు తెలిపింది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
Latests News
Harvard university: హార్వర్డ్‌పై ట్రంప్ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులువాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వర్సిటీల...
Unni mukundan: నా ఇమేజ్ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు మేనేజర్ విపిన్ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అన్నారు. విపిన్ ఫిర్యాదుపై ...
Gold: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతిసెప్టిక్ ట్యాంక్‌లో బంగారం వెతికేందుకు వెళ్లిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంటర్...
Anchor sreemukhi : ఆకుపచ్చ రంగు లంగా ఓణీలో మరింత అందంగా యాంకర్ శ్రీముఖి.. పిక్స్ వైరల్..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్ఇంటర్నెట్డెస్క్: భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor)పై ఆ పార్టీ సహచరుడు ఉది...