Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్
Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor)పై ఆ పార్టీ సహచరుడు ఉదిత్‌రాజ్ మండిపడిన సంగతి తెలిసిందే. భాజపా సూపర్ అధికార ప్రతినిధిగా
థరూర్‌ను నియమించాలంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా శశిథరూర్ స్పందించారు. తాను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ
గురువారం ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘నా దగ్గర ఎక్కువ సమయం లేదు. కానీ, గతంలో నియంత్రణరేఖ వెంబడి భారతీయ శౌర్యం గురించి నాకు తెలియదన్నట్లు మాట్లాడుతున్న వారి గురించి నేను ఇప్పుడు
స్పందిస్తున్నా. నేను ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతీకార చర్యల గురించే మాట్లాడాను. గత దాడులను గురించి ప్రస్తావించలేదు. ఇటీవల మనపై జరిగిన దాడులను, దానికి మన ప్రభుత్వం స్పందించిన
విధానాల ఆధారంగానే నేను మాట్లాడాను. అయితే.. ఎప్పటిలాగానే కొందరు విమర్శకులు, ట్రోలర్‌లు తమకు తగినట్లుగా నా వ్యాఖ్యలను వక్రీకరించడంలో విజయం సాధించారు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి’
అని థరూర్ రాసుకొచ్చారు. * శశిథరూర్‌ను భాజపా ప్రతినిధిగా నియమించాలి పనామాలో థరూర్ విలేకరులతో మాట్లాడుతూ.. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ల సందర్భంగా తొలిసారిగా భారత్.. పాకిస్థాన్
భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈక్రమంలో పార్టీ నేత ఉదిత్‌రాజ్ మాట్లాడుతూ.. ‘ప్రియమైన శశిథరూర్,
మిమ్మల్ని భాజపా సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్‌కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా
బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు. 1965లో భారత్ పాకిస్థాన్‌లోని లాహోర్ సెక్టారులో పలు
ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా పలు సర్జికల్ స్ట్రైక్‌లు నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం
పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’ అని పేర్కొన్నారు. మీకు ఎంతో ఇచ్చిన పార్టీపై నిజాయతీ లేకుండా ఎలా వ్యవహరించగలరని థరూర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పైనే తాజాగా శశిథరూర్ స్పందించారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Latests News
Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్ఇంటర్నెట్డెస్క్: భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor)పై ఆ పార్టీ సహచరుడు ఉది...
Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్ బృందంఇంటర్నెట్డెస్క్: ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఉ...
High court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరు సిఫార్సుతెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు (Supreme Court) కొలీ...
Israel: ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం..Israel ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...