Israel: ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం..
Israel: ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం.."
Play all audios:
Israel ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చింది. తాము లేజర్ ఆయుధమైన ఐరన్ బీమ్ వ్యవస్థలో
తక్కువ శక్తిమంతమైన ఆయుధం వాడినట్లు బుధవారం ఆ దేశ రక్షణ శాఖ, ఐడీఎఫ్ ప్రకటించాయి. ఈ సరికొత్త సిస్టమ్‌లో తక్కువ శక్తి లేజర్ బీమ్‌ను తాము ఇంటర్‌సెప్టర్‌గా యుద్ధంలో వాడినట్లు పేర్కొన్నాయి.
దీనిని ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో సైన్యానికి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ సంస్థ అభివృద్ధి చేసింది. హెజ్బొల్లా నుంచి డ్రోన్ల ముప్పు
పెరగడంతో అనుకున్న సమయం కంటే వేగంగా దీనిని రూపొందించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. ‘‘ప్రస్తుత యుద్ధంలో మా వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా.. లేజర్వ్యవస్థలను కూడా మోహరించాము. అవి చాలా అద్భుతంగా
పనిచేశాయి. శత్రువులు ప్రయోగించిన ఆయుధాలను అద్భుతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడటంతోపాటు.. దేశ ఆస్తులను రక్షించాయి’’ అని ఐడీఎఫ్, ఇజ్రాయెల్ రక్షణశాఖ వెల్లడించాయి. ఈ మేరకు ఐరన్ బీమ్
వ్యవస్థ విజయవంతంగా డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలను విడుదల చేసింది. మరోవైపు రఫేల్ సంస్థ ఛైర్మన్ యువల్ స్టెయింట్జ్ స్పందిస్తూ..‘‘ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తిమంతమైన లేజర్‌ను పూర్తిగా
వినియోగించి.. యుద్ధాల్లో ఇంటర్ సెప్టర్ వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది’’ అని పేర్కొన్నారు. మూడు శ్రేణుల్లో లేజర్ల అభివృద్ధి.. ఇజ్రాయెల్ ఇప్పటివరకు మూడు శ్రేణుల్లో లేజర్ ఆయుధాలను
అభివృద్ధి చేసింది. వీటిల్లో ఐరన్ బీమ్-ఎం అనేది భారీ వాహనాలపై అమర్చే శక్తిమంతమైన ఆయుధం. ఇది 50 కిలోవాట్ల శ్రేణి లేజర్‌తో ప్రత్యర్థి ఆయుధాలను కూల్చేస్తుంది. వివిధ లేయర్లు ఉండే రక్షణ
వ్యవస్థల్లో భాగంగా దీనిని వాడొచ్చు. ఐరన్ బీమ్‌లోనే తేలికపాటి వెర్షన్‌గా భావించి లైట్ బీమ్‌ను కూడా అభివృద్ధి చేసింది. దీనిని చిన్న వాహనాలపై అమర్చి ఉపయోగించవచ్చు. ఇది 10 కిలోవాట్ల శ్రేణి
హైఎనర్జీ లేజర్ ఆయుధం. యూఏవీలు, డ్రోన్ల దండుపై ప్రభావంతంగా పనిచేస్తోంది. దీంతో ప్రత్యర్థి డ్రోన్లను కూల్చడానికి అయ్యే ఖర్చు నామమాత్రమే అని రఫేల్ కంపెనీ వెల్లడించింది. ఏకకాలంలో కొన్ని
కిలోమీటర్ల దూరంలోని 10 లక్ష్యాలను ఇది కూల్చగలదు. ఇక యుద్ధ నౌకల పైనుంచి వినియోగించే నేవల్ ఐరన్బీమ్ను కూడా అభివృద్ధి చేసింది. ఇది 100 కిలోవాట్ల హైఎనర్జీ లేజర్‌ను వాడి యుద్ధ నౌకలను
రక్షిస్తుంది. యుద్ధనౌకలపై ఉన్న రక్షణ వ్యవస్థలు పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న ముప్పుతో (సాచురేటెడ్ అటాక్) బిజీగా మారినప్పుడు ఇది శక్తిమంతంగా పనిచేస్తుంది. కొన్ని వందల మీటర్ల నుంచి కొన్ని
కిలోమీటర్ల దూరంలోని ముప్పును ఇది అడ్డుకొంటుంది. ఇంటర్‌సెప్షన్‌కు అయ్యే ఖర్చు కూడా చాలా నామమాత్రమని కంపెనీ పేర్కొంటోంది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
Israel: ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం..Israel ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...
Fish prasadam: జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లపై డీసీపీ సమీక్షజూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించ...
Harvard: ట్రంప్ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలంటూ ప్రచారంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుత...
Acb: ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు: విజయ్కుమార్అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులమని ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డైరెక్టర్ విజయ...