Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్ బృందం
Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్ బృందం"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను
ఎండగట్టేందుకు శశిథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికా (USA)కు వెళ్లింది. ఈక్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం
ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఆయన భారత కాన్సులేట్‌లో వివరించారు. ‘‘పహల్గాంలో మతం ఆధారంగా
పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడితో భారత్‌లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది.
లష్కరే తయ్యిబాకు అనుబంధ సంస్థ ఇది. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే ఐరాసను అభ్యర్థించింది. నేను ప్రభుత్వంలో కాకుండా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. ఈ దాడి తర్వాత పాక్‌పై
తీసుకోవాల్సిన అంశాలను ఉద్దేశిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. భారత బలగాలు పాక్‌ను బలంగా, తెలివితో దెబ్బతీశాయి. * ఉగ్రవాదంపై పోరుకు బాసట పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత బలగాలు కచ్చితమైన
దాడులు చేసి.. వాటిని నేలమట్టం చేశాయి. మేము ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే.. పాక్ సైన్యం స్పందించింది. మాపై ప్రతిదాడులకు దిగింది. వాటిని సమర్థమంతంగా తిప్పికొట్టాం. ఈ ఆపరేషన్‌తో ఉగ్రచర్యలను భారత్
సహించదనే గట్టి సందేశం ఇచ్చింది. ఇది పహల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప.. పాక్‌తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదు. దాన్ని మేము కోరుకోవడం లేదు. దేశ ప్రజల రక్షణే మాకు ముఖ్యం’’ అని
శశిథరూర్ పేర్కొన్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
Latests News
Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్ బృందంఇంటర్నెట్డెస్క్: ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఉ...
High court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరు సిఫార్సుతెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు (Supreme Court) కొలీ...
Israel: ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం..Israel ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...
Fish prasadam: జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లపై డీసీపీ సమీక్షజూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించ...