Pbks vs mi: క్వాలిఫయర్-1లో పంజాబ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి
Pbks vs mi: క్వాలిఫయర్-1లో పంజాబ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి"
Play all audios:
జైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) లీగ్ దశను విజయంతో ముగించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో ఆ జట్టు క్వాలిఫయర్-1లో ఆడేందుకు అర్హత సాధించింది. ముంబయి ఇండియన్స్
(Mumbai Indians)తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు
చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ప్రియాంశ్ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోష్ ఇంగ్లిస్ (73; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)
అర్ధ శతకాలు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యర్ (26*), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 2, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
ఇక, ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే భారీ స్కోరు చేశాడు. ఓపెనర్లు రికెల్‌టన్ (27), రోహిత్ శర్మ (24) ఫర్వాలేదనిపించారు. హార్దిక్
పాండ్య (26), నమన్ ధీర్ (20), విల్ జాక్స్ (17) పరుగులు చేశారు. తిలక్ వర్మ (1) నిరాశపర్చాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2, విజయ్‌కుమార్ వైశాఖ్ 2, హర్‌ప్రీత్ బ్రార్ ఒక
వికెట్ పడగొట్టారు. పంజాబ్‌పై ఓటమితో నాలుగో స్థానానికి పరిమితమైన ముంబయి.. గుజరాత్ టైటాన్స్ లేదా ఆర్సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. రేపు (మంగళవారం) లఖ్‌నవూతో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ
గెలిస్తే 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. అప్పుడు గుజరాత్, ముంబయి మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Pbks vs mi: క్వాలిఫయర్-1లో పంజాబ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయిజైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) లీగ్ దశను విజయంతో ముగించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో...
Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?ఇంటర్నెట్‌డెస్క్: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్(Muhammad Yunus) రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు ...
Salman khan: సల్మాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టుబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వ...
Meenakshi natarajan: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్షహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Congress) నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natar...
Astrology ఈ రాశుల వారికి త్వరలో విదేశి యానం యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...