Salman khan: సల్మాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టు
Salman khan: సల్మాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టు"
Play all audios:
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్
(Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తితోపాటు, ఈషా
చాబ్రియా అనే మహిళా గెలాక్సీ అపార్ట్మెంట్లోకి అక్రమంగా ప్రవేశించారని.. తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తాము సల్మాన్‌ను కలిసేందుకు ఇంట్లోకి వెళ్లాలనుకున్నామని విచారణలో వారు
చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో సల్మాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది
గుర్తించి అతడిని అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు తన ఫోన్‌ను విసిరేశాడు. అదేరోజు సాయంత్రం మరోసారి సల్మాన్ ఇంటి వద్ద కనిపించాడు. గెలాక్సీ అపార్ట్మెంట్లో
ఉంటోన్న మరో వ్యక్తి కారు వెనక నక్కి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ అతడిని అడ్డుకుంది. బాంద్రా పోలీసులకు సమాచారం అందించింది. మేము అతడిని అదుపులోకి
తీసుకొని విచారించాం. తాను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చానని.. సల్మాన్‌ఖాన్‌ను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. పోలీసులు అనుమతించకపోవడంతోనే తాను కారు వెనక నక్కి లోపలికి వెళ్లానని చెప్పాడు’’ అని
పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అదే విధంగా, ఈనెల 21వ తేదీన ఇదే తరహా ఘటన గెలాక్సీ వద్ద చోటు చేసుకుంది. ఈషా చాబ్రియా అనే మహిళ తెల్లవారుజామున 3
గంటల సమయంలో హీరో ఇంటి ముందు చక్కర్లు కొట్టిందని.. అంతేకాకుండా ఇంట్లోకి ప్రవేశించిందని పోలీసులు తెలిపారు. ‘‘గెలాక్సీలోకి అడుగుపెట్టిన ఆమెను సిబ్బంది ఆపి.. ప్రశ్నించారు. తనకు సల్మాన్ సుమారు 6
నెలల నుంచి తెలుసని చాబ్రియా చెప్పింది. సల్మాన్ పిలిస్తేనే తాను వచ్చానని తెలిపింది. ఇదే విషయంపై సల్మాన్ కుటుంబ సభ్యులను ఆరా తీయగా.. ఆమె మాటలు అవాస్తవమని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి
తీసుకుని విచారణ మొదలుపెట్టాం’’ అని అన్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు గత కొంతకాలంగా వరుస బెదిరింపులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. గతేడాది సల్మాన్ నివాసం
ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దానికంటే ముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం
రేపింది. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యురిటీని నియమించింది. భారీ భద్రత నడుమ ఆయన సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల్లో
పాల్గొంటున్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Salman khan: సల్మాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టుబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వ...
Meenakshi natarajan: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్షహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Congress) నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natar...
Astrology ఈ రాశుల వారికి త్వరలో విదేశి యానం యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Pbks - ipl 2025: పంజాబ్ కింగ్స్ దూకుడు.. వారిద్దరే మాస్టర్ మైండ్స్తొలి సీజన్లో సెమీస్‌కు చేరిందా జట్టు. ఆ తర్వాత ప్రతి రెండు లేదా మూడు సీజన్లకు కొత్త కెప్టెన్. జట్టులోని ప్లేయర్లందరూ మా...
China: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్సు షాన్డాంగ్లో ఈ ప్రమాదం చోటుచే...