Kantara 1: ‘కాంతార చాప్టర్ 1’ వాయిదా..? స్పందించిన టీమ్
Kantara 1: ‘కాంతార చాప్టర్ 1’ వాయిదా..? స్పందించిన టీమ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kantara: Chapter 1). 2022లో విడుదలై విజయాన్ని అందుకున్న ‘కాంతార’కు ఇది
ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై చిత్రబృందం స్పందించింది. అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల
చేస్తామని వెల్లడించింది. ‘‘మేము అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాం. మా ప్రణాళికలకు తగినట్లే షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలవుతుంది. మమ్మల్ని
నమ్మండి. వేచి ఉండడం ఎంత విలువైనదో మీకే అర్థమవుతుంది. ఈ సినిమాపై వస్తోన్న ఊహాగానాలకు దూరంగా ఉండండి. అలాగే అనధికారిక ప్రకటనలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చిత్రబృందం ఎక్స్
వేదికగా పోస్ట్ పెట్టింది. ఇప్పటికే ప్రకటించిన తేదీనే (అక్టోబరు 2) ‘కాంతార 1’ బాక్సాఫీసు ముందుకొస్తుందని మరోసారి స్పష్టం చేసింది. * ఆ పోస్టు నేను పెట్టలేదు..: ట్రోల్స్‌పై స్పందించిన ‘భైరవం’
దర్శకుడు స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ‘కాంతార’ రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ. 400+ కోట్లు వసూళ్లు చేయడం విశేషం. తొలిభాగం కథ ఎక్కడి నుంచి
ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ‘కాంతార 1’లో చూపించనున్నారు. పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ప్రీక్వెల్‌లో ఎక్కువగా ఉండనున్నాయి. ముందుగా కన్నడలో విడుదలై హిట్‌గా నిలిచిన
‘కాంతార’ ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ అయిన సంగతి తెలిసిందే. ‘కాంతార చాప్టర్ 1’ను ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Latests News
Kantara 1: ‘కాంతార చాప్టర్ 1’ వాయిదా..? స్పందించిన టీమ్ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kant...
Pm modi: ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీదిల్లీ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు...
Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...
Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...
Anil ravipudi: మనోజ్.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్ స్టార్ట్ అయింది: అనిల్ రావిపూడిహైదరాబాద్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manoj Manc...