Financial changes: ఆధార్‌ అప్‌డేట్‌.. పీఎఫ్‌ 3. 0.. క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌.. జూన్‌లో వచ్చే మార్పులివే

Eenadu

Financial changes: ఆధార్‌ అప్‌డేట్‌.. పీఎఫ్‌ 3. 0.. క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌.. జూన్‌లో వచ్చే మార్పులివే"

Play all audios:

Loading...

Financial changes | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అంశాలు తరచూ మారుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం. మరికొన్ని రోజుల్లో జూన్‌ నెలలో ప్రవేశిస్తున్నాం. ఈ నెలలో కొన్ని బ్యాంకులు


క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించిన మార్పులు చేస్తున్నాయి. ఎఫ్‌డీ వడ్డీ రేట్లనూ సవరిస్తున్నాయి. ఈపీఎఫ్‌ఓలోనూ మార్పులు రాబోతున్నాయి. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ముగింపు కూడా ఈ


నెలలోనే. ఇలా జూన్‌లో రాబోయే మార్పులేంటో చూద్దాం పదండి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ


రేట్లను తగ్గించాయి. సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను జూన్‌ 1 నుంచి తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. జూన్‌ 1 నుంచి ఇతర బ్యాంకులూ వడ్డీ సవరించే అవకాశం ఉంది.


ఈపీఎఫ్‌ఓ 3.0 ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక అప్‌గ్రేడ్‌కు సిద్ధమవుతోంది. జూన్‌ నెలలో 3.0కు అప్‌గ్రేడ్‌ కానుంది. దీనివల్ల యూపీఐ, ఏటీఎం ద్వారా విత్‌డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


క్లెయిమ్‌ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. * ఒపెరా నియాన్‌ ఏఐ బ్రౌజర్‌.. గేమ్స్‌, వెబ్‌సైట్లు సృష్టించడం ఇక సులువు! సెబీ కటాఫ్‌ రూల్‌ ఓవర్‌నైట్‌ ఫండ్స్‌కు సంబంధించి కటాఫ్‌ సమయంలో సెబీ మార్పులు


చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆఫ్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్‌ఏవీ వర్తిస్తుంది. ఆ తర్వాత


వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్‌ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను సాయంత్రం 7 గంటల వరకు అనుమతిస్తారు. క్రెడిట్‌ కార్డు మార్పులు * కోటక్‌ మహీంద్రా


బ్యాంక్‌ ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లలో కోత పెట్టింది. జూన్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. యుటిలిటీస్‌, వాలెట్‌, ఎడ్యుకేషన్‌, ఫ్యూయల్‌, రెంట్‌ పేమెంట్‌,


ఇన్సూరెన్స్‌, గవర్నమెంట్ చెల్లింపులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి విషయాల్లో కొన్నింటికి పూర్తిగా రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తుండగా.. మరికొన్నింటికి పరిమితి విధిస్తోంది. * యాక్సిస్‌ బ్యాంక్‌


సైతం యుటిలిటీ, టెలికాం, రెంట్‌, ఫ్యూయల్‌, వాలెట్‌, ఇన్సూరెన్స్‌, ఎడ్యుకేషన్‌ వంటి లావాదేవీలపై జూన్‌ 20 నుంచి రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తోంది. రెంట్‌, వాలెట్‌ టాప్‌-అప్స్‌ను వార్షిక ఫీజు


మినహాయింపు పరిమితి నుంచి తప్పించింది. * హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్‌ కార్డు హోల్డర్లకు లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయంలో మార్పులు చేపట్టింది. ఒక త్రైమాసికంలో రూ.50 వేలు


మించి కొనుగోలు చేసిన వారికే లాంజ్‌ యాక్సెస్‌ అందిస్తుంది. జూన్‌ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. వడ్డీ రేట్ల ఊరట ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్‌ 4, 5, 6 తేదీల్లో సమావేశం కానుంది. ఆరో


తేదీన భేటీ నిర్ణయాలు వెలువడనున్నాయి. గత రెండు సమావేశాల్లో రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించింది. మరోసారి కూడా ఊరట లభిస్తే గృహ, వాహన రుణ వినియోగదారులకు ఆ మేర ప్రయోజనం చేకూరనుంది. ఆధార్‌ అప్‌డేట్‌


ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్‌ 14తో ముగియనుంది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా


రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.


ఎల్‌పీజీ సిలిండర్‌ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. మే నెలలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గింది. ఈసారి కూడా ఒకటో తేదీన మార్పులుండొచ్చు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Latests News

Financial changes: ఆధార్‌ అప్‌డేట్‌.. పీఎఫ్‌ 3. 0.. క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌.. జూన్‌లో వచ్చే మార్పులివే

Financial changes | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అంశాలు తరచూ మారుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం. మరికొన...

Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు

ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను చాటుకున్...

Himanta biswa sarma: ఆ ప్రాంతాల్లో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇస్తాం: సీఎం హిమంత ప్రకటన

గువాహటి: స్థానిక ప్రజల రక్షణ దృష్ట్యా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న ...

Chagos islands: ఆగండి.. చాగోస్‌ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు..

Chagos Islands || ఇంటర్నెట్‌డెస్క్‌: హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్‌ ద్వీప సముదాయాన్ని మారిషస్‌కు అప్పగించకుం...

Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ...

Top