Chagos islands: ఆగండి.. చాగోస్ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు..
Chagos islands: ఆగండి.. చాగోస్ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు.."
Play all audios:
Chagos Islands || ఇంటర్నెట్‌డెస్క్: హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ ద్వీప సముదాయాన్ని మారిషస్‌కు అప్పగించకుండా.. బ్రిటన్‌లోని ఓ కోర్టు అడ్డుకొంది. వాస్తవానికి ఈ ద్వీపాలను
అప్పగిస్తూ యూకే ప్రధాని స్టార్మర్, మారిషస్ ప్రభుత్వం నేడు సంతకాలు చేయాల్సి ఉంది. చాగోస్‌కు చెందిన పాంపే అనే మహిళ చివరి నిమిషంలో వేసిన పిటిషన్‌పై హైకోర్టు జడ్జి సర్ జులియన్ గూసే నిలుపుదల
ఆదేశాలు జారీ చేశారు. పాంపే చాగోస్ దీవుల్లోని డియేగో గార్సియాలో జన్మించింది. కానీ, ఆరు నెలల వయస్సులో ఆ ప్రదేశాన్ని వీడి సీషెల్స్‌కు చేరుకొని పెరిగింది. ప్రస్తుతం లండన్‌లో జీవిస్తోంది. ఈ
రకంగా వేలమంది జీవిస్తున్నారు. ఈ డీల్ పూర్తయితే ఇక్కడ పుట్టి వేరే ప్రదేశాల్లో జీవిస్తున్న వారికి లభించే కొన్ని ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో న్యాయస్థానం దాదాపు ఐదు గంటలపాటు
వాదనలు విని.. డీల్‌కు బ్రేకులు వేసింది. మరికొద్ది గంటల్లో తిరిగి విచారణ చేపట్టనుంది. రెండు దేశాల మధ్య జరగనున్న ఒప్పందానికి ఓ న్యాయమూర్తి బ్రేకులు వేయడం యూకే న్యాయచరిత్రలో ఇటీవల కాలంలో ఇదే
తొలిసారి. మరో వైపు యూకే ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆ దీవులు మారిషస్‌విగా తేలినట్లు వాదిస్తోంది. దీంతో తమ వద్ద మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించింది. మరోవైపు ఈ
దీవుల్లో ఒకటైన డియేగో గార్సియాను అమెరికాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన పత్రాలు ఇంకా పబ్లిష్ కాలేదు. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండేవి. ఈ ద్వీప
సమూహాన్ని మారిషస్‌కు తిరిగి అప్పగించి, ఆ దీవుల్లో అతిపెద్దదైన డియేగో గార్సియాను లీజుకు తీసుకోవడానికి బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకోనుంది. అక్కడ బ్రిటిష్- అమెరికన్ సంయుక్త సైనిక, వైమానిక
స్థావరం ఉంది. దీంతో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమోద ముద్ర వేశారు. డియేగో గార్సియాకు అమెరికా ఇటీవలే ఆరు బి-2 స్టెల్త్ బాంబర్ విమానాలను తరలించింది. అమెరికాకు మొత్తం 20 బి-2
బాంబర్లు ఉండగా, వాటిలో ఆరింటిని ఇక్కడే మోహరించడం దీని ప్రాధాన్యం తెలియజేస్తోంది. హిందూ మహాసముద్రంలో తమ పట్టు నిలబెట్టుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
Chagos islands: ఆగండి.. చాగోస్ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు..Chagos Islands || ఇంటర్నెట్‌డెస్క్: హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ ద్వీప సముదాయాన్ని మారిషస్‌కు అప్పగించకుం...
Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ...
Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్.. బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ మృతియూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ నవీన్‌కుమార్ మృతి చెందాడు. ఇంట...
Ajit doval: ఎస్-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు డోభాల్..దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా...
Rammohan naidu: సంక్షోభాలను ఎదురొడ్డి విజయవంతంగా సాగిన తెదేపా: రామ్మోహన్నాయుడువిశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి ఏడాదిలోపే సాధ్యం చేసి చూపామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నార...