Donald trump: బైడెన్‌కు క్యాన్సర్ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్
Donald trump: బైడెన్‌కు క్యాన్సర్ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్"
Play all audios:
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ ఆలస్యం కావడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe
Biden)కు క్యాన్సర్ నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కు క్యాన్సర్ సోకిందనే విషయాన్ని
ఆలస్యంగా బయటపెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఈ
క్యాన్సర్‌ను గ్లీసన్ స్కోరింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి అంచనా వేస్తారు. ఇందులో బైడెన్ స్కోరు 9 ఉన్నట్లు కార్యాలయం తెలిపింది. దీనిపైనే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ సోకిందన్న విషయం
చాలా రోజుల తర్వాత తెలియడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కోరు 9కు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. బైడెన్ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నారని గతంలో అదే వైద్యుడు చెప్పారు. ఇది రాజకీయమైన అంశం
కాదు. ఇది మన దేశానికి ప్రమాదం. క్యాన్సర్ విషయం ఇప్పటివరకు ఎందుకు బయటకు చెప్పలేదు. ప్రజలకు దీని గురించి వాస్తవాలు తెలియాలి. కొందరు వాస్తవాలు చెప్పడం లేదు. ఇది మరో పెద్ద సమస్య’ అని ట్రంప్
పేర్కొన్నారు. * Joe Biden: బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ జిల్ బైడెన్ నకిలీ వైద్యురాలు జో బైడెన్ క్యాన్సర్ నిర్ధరణ ఆలస్యం కావడంపై డొనాల్డ్ ట్రంప్ జూనియర్ స్పందించారు. ఈసందర్భంగా
బైడెన్ సతీమణి జిల్ బైడెన్ (Jill Biden) ఒక నకిలీ వైద్యురాలంటూ విమర్శలు చేశారు. జిల్ డాక్టర్ అయినప్పటికీ తన భర్తలో క్యాన్సర్ లక్షణాలు గమనించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన
ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Trending News
Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూట...
Vikram Murthi – Rolling StoneVikram MurthiReporter70 Greatest Comedies of the 21st Century From rom-coms to raunch-coms, 'Anchorman' to 'Girls Trip' ...
Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...
Humsafar express: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలుశనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్ సమీపంలో...
Narayana hrudayalaya to raise rs 613 crore via ipoJP Morgan, PineBridge to partially exit through Narayana Hrudayalaya's Rs 613 crore IPO Renowned cardiologist Devi ...
Latests News
Donald trump: బైడెన్‌కు క్యాన్సర్ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ ఆలస్యం కావడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించ...
Delhi ordinance bill: లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు!Published by: Last Updated:August 01, 2023 3:17 PM IST DELHI ORDINANCE BILL: లోక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ...
Operation sindoor: భారత్ దాడి చేసింది.. లష్కరే పుట్టపైనేOperation Sindoor | ఇంటర్నెట్‌డెస్క్: అమాయక ప్రజలు, ప్రార్థనామందిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిందంటూ.. పాక్ ఎన్ని...
Anand mahindra | latest anand mahindra - eenaduపడ్డామండీ ప్రేమలో.. ప్రేమలో పడి తమ అనుబంధాన్ని దాంపత్య బంధంగా మలచుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఆ క్రమంలో మధురమైన జ్ఞాపకాల...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) ప్రారంభించిన పనుల్లో ఇతరుల సాయం పొందుతారు. ఆర...