Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..

Telugu

Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు.."

Play all audios:

Loading...

Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూటర్లు దుమ్మురేపుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. ఆసియా


క్రీడల్లో (Asian Games 2023) భారత్ (India)కు పతాకాల పండుతుంది. షూటర్లు గురి తప్పడం లేదు. ఇప్పటివరకు భారత్ నెగ్గిన పతకాల్లో షూటర్లదే హవా. ఇక.. ఇవాళ రెండు గోల్డ్ మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు మన


భారత షూటర్లు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ సొంతం చేసుకుంది. భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును


నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఇక.. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్‌, దివ్య తడిగోల్


బృందం రజతం కైవసం చేసుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు దక్కించుకున్నారు. దీంతో ఇప్పటివరకు షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు,


5 కాంస్య పతకాలు ఉన్నాయి. advertisement advertisement మరోవైపు టెన్నిస్ డబుల్స్‌లో రజత పతకం భారత్‌ సాధించింది. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ ఫైనల్ లో ఓడి


సిల్వర్‌ గెలుచుకుంది. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి మెడల్‌ కాగా.. సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. ఇక.. మహిళల స్క్వాష్‌ సెమీ ఫైనల్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన


జోషానా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్‌సింగ్‌లు ఓడి కాంస్యం అందుకున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్ లో భారత్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌ మహిళల టీమ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్‌ థాయ్‌లాండ్‌


(0-3) చేతిలో ఓడిపోయింది. పివి సింధు, ట్రీసా-గాయత్రి, మరియు అష్మితా చలిహాలు తమ తమ మ్యాచ్‌లలో ఓడిపోయారు. advertisement advertisement ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 31కి చేరింది.


దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. ఇదే ఊపు కొనసాగిస్తే భారత్ ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. 2018 ఆసియా క్రీడలు దాటే అవకాశం ఉంది Stay updated with the


latest news, Download the News18 App to stay updated! Location : Hyderabad,Telangana Vijayawada,Krishna,Andhra Pradesh First Published : September 29, 2023 10:58 AM IST Read More


Trending News

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Upcoming telugu movies: ఈ వారం థియేటర్‌లో వినోదాలను పంచే చిత్రాలివే

ఇప్పుడు తెలుగులోనూ.. kesari chapter 2 Telugu || అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్‌ కోర్ట...

Subramanya Swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenadu

యాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...

Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠీని సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

లఖ్‌నవూ, హైదరాబాద్‌ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో దిగ్వేశ్‌ రాఠీ.. అభిషేక్‌ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...

Latests News

Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..

Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూట...

ఆ ఊళ్లో పట్టపగలే అరాచకాలు.. జనం ఎందుకు భయపడుతున్నారంటే..

Reported by: Published by: Last Updated:April 25, 2023 5:46 PM IST ANDHRA PRADESH: ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంల...

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

పోస్టర్లలో  రజనీ ఫొటో మాత్రమే..

సాక్షి, చెన్నై : రజనీకాంత్‌ పార్టీ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన ఆయన బుధవారం ముఖ్యనేతలతో భేట...

Top