Russia-ukraine: ఉక్రెయిన్‌తో మరోసారి శాంతి చర్చలు.. రష్యా ప్రతిపాదన
Russia-ukraine: ఉక్రెయిన్‌తో మరోసారి శాంతి చర్చలు.. రష్యా ప్రతిపాదన"
Play all audios:
మాస్కో: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధం ముగింపు దిశగా గణనీయమైన స్థాయిలో ఈ చర్చలు ఫలితం
ఇవ్వలేదు. తాజాగా మరోసారి ప్రత్యక్ష చర్చల కోసం రష్యా (Russia) ప్రతిపాదనలు చేసింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సుస్థిర శాంతి కోసం
ఇస్తాంబుల్‌లో జూన్ 2 మరోసారి నేరుగా చర్చలు జరపాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే దీనిపై కీవ్ ఇంతవరకు స్పందించలేదు. మాస్కో, కీవ్ మధ్య శాంతి ప్రక్రియ విజయవంతం కోసం మాటల్లోనే కాకుండా
నిజాయతీగా ఆసక్తి చూపేవారందరూ మరోసారి చర్చలకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు లావ్రోవ్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలపై ఒత్తిడి తేవడంతో తుర్కియే
వేదికగా ఈ నెల 16న ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. పలు అంశాలపై చర్చించారు. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. ఈ నేపథ్యంలో మే 19న ట్రంప్, పుతిన్ ఫోన్
కాల్‌లో దాదాపు రెండు గంటలకుపైనే మాట్లాడుకున్నారు. అనంతరం పుతిన్ స్పందిస్తూ భవిష్యత్తు శాంతి ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్‌తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓవైపు శాంతి చర్చల
మంతనాలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద గగనతల దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై 69 క్షిపణులు, 298 డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నట్లు మండిపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని నాలుగు గ్రామాలను రష్యా ఆక్రమించినట్లు
అధికారులు తెలిపారు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్ప్రతాప్పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యా...
లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు.లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగ...
Ghulam nabi azad: పాక్ ఉగ్రవాదుల పుట్ట.. ప్రపంచంలో మరెక్కడా అంత మంది లేరు: గులాం నబీ ఆజాద్ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ విమర్శించ...
Latests News
Russia-ukraine: ఉక్రెయిన్‌తో మరోసారి శాంతి చర్చలు.. రష్యా ప్రతిపాదనమాస్కో: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలి...
Chandrababu: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకడప: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ ఛ...
మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీAlcatel V3 series | ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ అల్కాటెల్ కొత్త మొబైల్స్‌ను భారత మార్కెట్...
Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవేLava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...
Revanth reddy: అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: సీఎం రేవంత్రెడ్డిమెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని స...