Brain dead: హార్ట్‌బీట్ చట్టం.. గర్భిణి బ్రెయిన్ డెడ్ అయినా పిండాన్ని బతికించేందుకు వైద్యం
Brain dead: హార్ట్‌బీట్ చట్టం.. గర్భిణి బ్రెయిన్ డెడ్ అయినా పిండాన్ని బతికించేందుకు వైద్యం"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: గర్భం దాల్చిన ఓ యువతి అనారోగ్యం కారణంగా బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. కానీ కడుపులో పిండాన్ని బతికించేందుకు ఆమెకు వైద్యం అందిస్తున్నారు. యాంటీ అబార్షన్ చట్టం ప్రకారం పిండాన్ని
తొలగించే అవకాశం లేకపోవడంతో చికిత్స నిలిపివేయడానికి వైద్యులు నిరాకరించారు. అమెరికాలోని జార్జియాకు చెందిన కుటుంబం ఇష్టంతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతోంది (Brain-dead Georgia woman).
జార్జియాలోని అట్లాంటా పట్టణానికి చెందిన ఆడ్రియానా స్మిత్ ఒక నర్స్. ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరిలో తొమ్మిది వారాల గర్భిణిగా ఉన్న సమయంలో ఆమెను తలనొప్పి
వేధించింది. వరుసగా తలనొప్పి రావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు చూపించుకుందని ఆమె తల్లి ఏప్రిల్ న్యూకిర్క్ వెల్లడించారు. ‘‘వారు కొన్ని మందులు ఇచ్చారు. కానీ ఎలాంటి పరీక్షలు,
స్కాన్ చేయలేదు. వారు పరీక్షించి ఉంటే.. సమస్య తెలిసిపోయేది. కానీ ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో నా కుమార్తె పనిచేసే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ స్కాన్
చేయగా.. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు ప్రకటించారు’’ అని ఏప్రిల్ తెలిపారు. అప్పటినుంచి స్మిత్ లైఫ్ సపోర్ట్ మీదే ఉంటుంది. జార్జియా అబార్షన్
చట్టాల ప్రకారం, పిండంలో హృదయ స్పందన ఉంటే.. అబార్షన్‌కు అనుమతి ఉండదు. దీనినే అక్కడ ‘హార్ట్‌బీట్ లా’ అని పిలుస్తుంటారు. ఈ నిబంధన కారణంగా స్మిత్ విషయంలో ఆమె కుటుంబం ఏ నిర్ణయం తీసుకొనే
వీలులేకుండా పోయింది. ప్రస్తుతం ఈ గర్భస్థ శిశువు వయసు 21 వారాలు. ‘‘ఇదంతా నాకు ఎంతో కష్టంగా ఉంది. ఆసుపత్రిలో నా ఎదురుగా నా బిడ్డ కనిపిస్తోంది. కానీ ఆమె అక్కడ లేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ
శిశువు బయట పరిస్థితులను తట్టుకునేవరకు స్మిత్‌ను అలా లైఫ్ సపోర్ట్ మీద కొనసాగించనున్నారు. ‘‘ప్రతి మహిళకు తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి. లేకపోతే ఆమె భాగస్వామి, తల్లిదండ్రులకు
ఉండాలి. ఇక్కడ నా ఉద్దేశం గర్భాన్ని తొలగించాలని కాదు. కానీ ఎంచుకునే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి జీవితం ఉండబోతుందో అని మాకు ఆందోళనగా ఉంది’’ అని
ఏప్రిల్ న్యూకిర్క్ వాపోయారు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్మోహన్రె...
Ravi mohan: జయం రవి కోసం రూ. 100 కోట్లు అప్పు చేశా.. : నటుడిపై అత్త ఆరోపణలుజయం రవి (Ravi Mohan) కుటుంబ వివాదం రోజురోజుకీ ముదురుతోన్న విషయం తెలిసిందే. ఆయన తీరును తప్పుపడుతూ తాజాగా ఆర్తి తల్లి, నిర...
Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవేLava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...
Latests News
Brain dead: హార్ట్‌బీట్ చట్టం.. గర్భిణి బ్రెయిన్ డెడ్ అయినా పిండాన్ని బతికించేందుకు వైద్యంఇంటర్నెట్డెస్క్: గర్భం దాల్చిన ఓ యువతి అనారోగ్యం కారణంగా బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. కానీ కడుపులో పిండాన్ని బతికించేందుక...
President Droupadi MurmuSays Ladakh has tremendous potential for the development of spiritual, adventure, and eco-tourism. View More Era of peac...
Palamu news in hindi: palamu latest news,palamu news paper - dainik jagran'ट्रंप के कहने पर पीएम मोदी ने किया सरेंडर', सीजफायर को लेकर राहुल गांधी के बयान पर मचा सियासी घमासान politics...
లెజెండరీ నటి కన్నుమూతసాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియా సిన...
Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తంకోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు (Drone like objects)...