Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తం
Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తం"
Play all audios:
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు (Drone like objects) కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త
పరిస్థితుల నేపథ్యంలో నగర (Kolkata) పోలీసులు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్
సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నివేదిక అందిందని.. దర్యాప్తు కొనసాగుతోందని రక్షణ శాఖ అధికారులు
చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. * అమెరికా రక్షణకు బంగారు కవచం.. ఏమిటీ గోల్డెన్ డోమ్..? ఈ డ్రోన్లను
పోలిన వస్తువుల కదలికలను హేస్టింగ్ పోలీసుస్టేషన్ పోలీసులు మొదట గుర్తించారు. వీటికి డ్రోన్లతో పోలికలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఇవి వచ్చాయని
తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కోల్‌కతా డిటెక్టివ్ విభాగాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని వెల్లడించారు. ఈ డ్రోన్లు ఎవరికి సంబంధించినవి? వీటితో ఎవరైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారా?
అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని అధికారులు తెలిపారు.
Trending News
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...
Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste englandArjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England  The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...
Latests News
Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తంకోల్కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు (Drone like objects)...
Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...
Uttar pradesh news | latest uttar pradesh news - eenaduATIQ AHMAD: అతీక్ రాసిన ‘రహస్య లేఖ’.. యూపీ సీఎం, సీజేఐల కోసమే! హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ‘ర...
Longest sea bridge: దేశంలో అతిపొడవైన సముద్రపు వంతెన.. ప్రారంభించిన మోదీదేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్‌ఎల్)ను ప్రధాని మోదీ(Modi) ప్రారంభించార...
ఈ మొక్క రక్తంలో చెక్కరను తొలగిస్తుంది.. పాము విషానికి దివ్య ఔషధం..!గుడ్మార్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మహిళల్లో మధుమేహం, బీపీ, ఊబకాయం, కాలేయ వ్యాధి, చర్మ సంబంధ...