Us: ఆపరేషన్ సిందూర్.. పాక్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ
Us: ఆపరేషన్ సిందూర్.. పాక్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ"
Play all audios:
న్యూయార్క్: ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులకు అమెరికా (US) రాయబార కార్యాలయం పలు
హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇరుదేశాల గగనతలాల మూసివేత, పాక్‌లోని
పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాక్‌లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని.. అమెరికా అడ్వైజరీ
సూచించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. * ‘ఆపరేషన్ సిందూర్’.. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందంటే..? కాగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల
విషయంపై అమెరికా ఇప్పటికే స్పందించింది. ఈ ఘర్షణకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరని.. భారత్, పాక్‌లకు
ఎంతో చరిత్ర ఉందని అన్నారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలని, ఘర్షణలు వద్దని అన్నారు. యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం మాట్లాడుతూ..‘‘ఆధారాలు,
సాంకేతిక సమాచారం, అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యం ఆధారంగా భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ దాడిలో అక్కడి పౌర, ఆర్థిక,
సైనిక లక్ష్యాల జోలికి భారత్ వెళ్లలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి’’ అని పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత రాయబారికి పాక్ సమన్లు జారీ చేసినట్లు
అధికారులు పేర్కొన్నారు.
Trending News
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్‌బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Latests News
Us: ఆపరేషన్ సిందూర్.. పాక్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీన్యూయార్క్: ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన నేపథ...
ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడ దీసిన కుటుంబం.. ఎందుకంటే..?Reported by: Published by: Last Updated:September 03, 2023 4:00 PM IST మానవత్వాన్ని మరిచిపోయి ఓ కుటుంబంలోని సభ్యులు అమాన...
Iphone 15: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు!బ్యాంక్ ఆఫర్లు : ఎస్బీఐ కార్డుతో ఐఫోన్ 15 కొనే కస్టమర్లు ఫ్లాట్ రూ.6,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ క...
North korea | latest north korea - eenaduరష్యా, ఉత్తర కొరియాలపై ట్రంప్ సుంకాల్లేవ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి రష్యా, ...
Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్ సహా ముగ్గురు మృతిఅమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...