Digvesh rathi - ipl 2025: దిగ్వేశ్‌.. ఎందుకింత ఆవేశం.. వివాదాల ‘ముద్ర’ అవసరమా?

Eenadu

Digvesh rathi - ipl 2025: దిగ్వేశ్‌.. ఎందుకింత ఆవేశం.. వివాదాల ‘ముద్ర’ అవసరమా?"

Play all audios:

Loading...

కుర్రాళ్లు దూకుడుగా ఉండాలి. విరాట్‌ కోహ్లి(Virat kohli) ఇండియన్‌ క్రికెట్‌లోకి వచ్చిన దగ్గర నుంచి భారత క్రికెట్‌లో ఈ ఒరవడి ఎక్కువైంది. ప్రత్యర్థిని ఆటతోనే కాకుండా మాటతోనూ ఢీకొనాలనే తత్వం


పెరిగింది. వికెట్‌ పడ్డాక లేదా విజయం సాధించాక దూకుడుగా సంబరాలు చేసుకోవడం ఇందులో భాగమే. కొంతమంది కుర్రాళ్లు ఇదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super


Giants) ప్లేయర్‌ దిగ్వేశ్‌ రాఠీ (Digvesh Rathi)నే ఇందుకు ఉదాహరణ. విరాట్‌ గడ్డ దిల్లీ నుంచే వచ్చిన ఈ స్పిన్నర్‌.. తొలి ఐపీఎల్‌ (IPL)లోనే ఆటతో కాకుండా దూకుడుతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.


వికెట్‌ తీశాక దురుసుగా సంబరాలు చేసుకుంటూ చాలాసార్లు జరిమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు అభిషేక్‌ శర్మతో గొడవ పడి జరిమానాకు గురయ్యాడు. అంతేకాదు ఒక మ్యాచ్‌


సస్పెన్షన్‌ కూడా ఎదుర్కొంటున్నాడు.  సంబరాలపైనే దృష్టి వికెట్‌ తీసిన తర్వాత ఏ బౌలర్‌కైనా ఆనందం ఉంటుంది. కానీ సంబరాలు ప్రత్యేకంగా ఉండాలనుకొని దురుసుగా ప్రవర్తిస్తేనే ఇబ్బంది. ఐపీఎల్‌-18లో


దిగ్వేశ్‌ మెరుగ్గానే బౌలింగ్‌ చేశాడు. 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. తొలి ఐపీఎల్‌ అన్న ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో బంతులు వేస్తున్నాడు. కానీ వచ్చిన ఇబ్బందల్లా వికెట్‌ తీసిన ప్రతిసారీ


నోట్‌బుక్‌ టిక్‌ సంబరాలు చేసుకోవడం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇలా దూకుడుగా సంబరాలు చేసుకోవడం వల్ల మ్యాచ్‌ ఫీజులో కోతను ఎదుర్కొన్నాడు.  కొత్త కుర్రాడు కదా! ఆ మాత్రం ఉత్సాహం ఉంటుంది. ఆ తర్వాత


తగ్గుతాడని అనుకుంటే నోట్‌బుక్‌ సంబరాలనే కాస్త మార్చి గడ్డిపై సంతకం చేస్తున్నట్లు సెలబ్రేషన్స్‌ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఐపీఎల్‌ చర్యలకు ఏమాత్రం బెదరకుండా అతడు తన యాటిట్యూడ్‌ను ప్రదర్శిస్తూనే


ఉన్నాడు. ఆరంభంలో కొత్తగా అనిపించినా తర్వాత అభిమానులు కూడా విసుగొచ్చి సామాజిక మాధ్యమాల్లో విమర్శించడం మొదలుపెట్టారు. ఆటగాడిగా పేరు లేదు.. ఆడేది తొలి ఐపీఎల్‌.. అయినా ఎందుకంత దూకుడు అని


సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.  అభిషేక్‌కి బైబై చెప్పి..  సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో దిగ్వేశ్‌ దూకుడు ఇంకో దశకు వెళ్లింది. మెరుపు షాట్లతో మ్యాచ్‌ను లఖ్‌నవూకు దూరం చేసిన అభిషేక్‌


శర్మను ఔట్‌ చేసిన అతడు మరోసారి సంయమనం కోల్పోయాడు. మళ్లీ నోట్‌బుక్‌ సంబరాలతో కాస్త దూకుడుగా అభిషేక్‌కు బైబై చెప్పాడు. దీంతో సాధారణంగా నెమ్మదిగా ఉండే అభిషేక్‌ కూడా నోటికి పని చెప్పాడు. ఇద్దరి


మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్‌ వచ్చి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇంకేముంది మళ్లీ దిగ్వశ్‌కు జరిమానా పడింది. అంతేకాదు.. ఈసారి ఓ మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ కూడా అయ్యాడు. అభిషేక్‌కు కూడా జరిమానా


పడినా దిగ్వేశ్‌ మాత్రం తన మ్యాచ్‌ ఫీజులన్నీ జరిమానాలకే వాడుతున్నట్లుందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  దిగ్వేశ్‌ ఆవేశం తగించుకోకపోతే అతడి భవిష్యత్‌కే ఇబ్బందిని కామెంట్లు చేస్తున్నారు.


ఎందుకంటే దిగ్వేశ్‌ ఎంతో కష్టపడి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. దేశవాళీ మ్యాచ్‌లు ఎక్కువగా ఆడకపోయినా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు విజయ్‌ దహియా ప్రోత్సాహంతో లఖ్‌నవూ ఫ్రాంఛైజీ దిగ్వేశ్‌పై నమ్మకముంచి వేలంలో


తీసుకుంది. సునీల్‌ నరైన్‌ శైలి బౌలింగ్‌.. ఇమ్రాన్‌ తాహిర్‌ తలకట్టుతో అతడు ఆరంభం నుంచే అభిమానులను ఆకట్టుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లఖ్‌నవూకు మంచి ప్రత్యామ్నాయంగా మారాడు. కానీ


అనుచిత ప్రవర్తన, అతి సంబరాలు చేసుకునే శైలి వల్ల అతడి నైపుణ్యం కనుమరుగై.. వివాదాల మనిషి అనే ముద్ర పడుతోంది. జరిమానాలు పడడం పక్కన పెడితే ఈ ప్రవర్తన అతడి కెరీర్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.


వచ్చే ఐపీఎల్‌లోనైనా కొత్త దిగ్వేశ్‌ను చూస్తామేమో! _- ఈనాడు క్రీడావిభాగం _


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

Published by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Vivek plays a retired police officer in 'vellai pookkal'

The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Latests News

Digvesh rathi - ipl 2025: దిగ్వేశ్‌.. ఎందుకింత ఆవేశం.. వివాదాల ‘ముద్ర’ అవసరమా?

కుర్రాళ్లు దూకుడుగా ఉండాలి. విరాట్‌ కోహ్లి(Virat kohli) ఇండియన్‌ క్రికెట్‌లోకి వచ్చిన దగ్గర నుంచి భారత క్రికెట్‌లో ఈ ఒరవ...

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి

సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్‌ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద...

Modi on operation sindoor: ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింద...

ఇది నీ కథేనా అని అడుగుతున్నారు!

‘‘ఎఫ్‌సీయూకే’లో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, ఇది నీ కథేనా? అని కొందరు అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూ...

Top