Modi on operation sindoor: ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Eenadu

Modi on operation sindoor: ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ స్ట్రైక్స్ గురించి ప్రధాని సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ


గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అభివర్ణించారని సమాచారం (Operation Sindoor). పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు


ఉగ్రశిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని


నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీకి


ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత


ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్‌


డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌


(Security Advisor Ajit Doval) మాట్లాడారు.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Travelling to us: అమెరికాకు ప్రయాణమా? ఈ వస్తువులను లగేజీలో తీసుకెళ్లొద్దు

Travelling To US | ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానాల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీస...

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Latests News

Modi on operation sindoor: ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింద...

Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదే...

Costly color: ఈ రంగు గోల్డ్ కంటే ఖరీదైనది.. దాని పేరు, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు

రంగుల పండుగ హోలీలో అందరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలంతో సహా ఇతర రంగులు మార్కెట్లో ...

Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడి

వేదాంత గ్రూప్‌ ఈశాన్య ప్రాంతంలో చమురు & గ్యాస్, కీలకమైన ఖనిజాలు, ఇతర రంగాలలో రూ. 30,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టను...

Nizamabad news | latest nizamabad news - eenadu

INDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్‌ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...

Top