Shubman gill: టెస్ట్‌ కెప్టెన్సీ సంగతి తర్వాత.. గిల్‌ ముందు టీమ్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలి: శ్రీకాంత్‌

Eenadu

Shubman gill: టెస్ట్‌ కెప్టెన్సీ సంగతి తర్వాత.. గిల్‌ ముందు టీమ్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలి: శ్రీకాంత్‌"

Play all audios:

Loading...

‘అంతా శుభ్‌మన్‌ గిల్‌ను కాబోయే కెప్టెన్‌ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులో స్థానమే పదిలం కాదు. బుమ్రానే కెప్టెన్‌ చేయాలి’ అంటున్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి


శ్రీకాంత్‌ ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ (Rohit Sharma) రిటైర్‌మెంట్‌ తర్వాత కెప్టెన్‌ అయ్యే అన్ని అర్హతలు జస్ప్రీత్‌ బుమ్రాకు (Jasprit Bumrah) ఉన్నాయని టీమ్‌ఇండియా


(Team India) మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌పై (Shubman Gill) కెప్టెన్సీని రుద్దకూడదని అభిప్రాయం వ్యక్తంచేశాడు. అతడు ముందు టీమ్‌లో కుదురుకొని, స్థానం సుస్థిరం


చేసుకోవాలని సూచించాడు. తన దృష్టిలో గిల్ ప్రస్తుత SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పరిస్థితుల్లో తుదిజట్టులో కచ్చితంగా లేడని పేర్కొన్నాడు. అలాగే బుమ్రా వర్క్‌లోడ్‌


మీద వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా శ్రీకాంత్‌ తోసిపుచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), రిషభ్‌పంత్‌లలో (Rishabh Pant)లో ఎవరైనా ఒకర్ని వైస్‌ కెప్టెన్‌ చేయాలి. అప్పుడు బుమ్రా ఆడని ఒకటి రెండు


టెస్టుల్లో వీళ్లు కెప్టెన్సీ బాధ్యతలు మోస్తారని చెప్పాడు.  ‘‘అంతా శుభ్‌మన్‌ గిల్‌ను కాబోయే కెప్టెన్‌ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులోనే స్థానం పదిలం కాదు. కేఎల్‌ రాహుల్‌,


రిషభ్‌పంత్‌కు కెప్టెన్సీ ఇవ్వనిపక్షంలో కచ్చితంగా జస్ప్రీత్‌ బుమ్రాకు ఇవ్వాలి. నేనే ఒకవేళ సెలక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌ అయితే ముమ్మాటికీ బుమ్రాకే కెప్టెన్సీ ఇస్తాను. ‘ఎన్ని మ్యాచ్‌లు వీలుంటే


అన్ని ఆడు. మిగతా బాధ్యతలు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ లేదా రిషభ్‌ పంత్‌ చూసుకుంటారు’ అని నేను అతడితో చెబుతాను. ఎందుకంటే టీమ్‌లో ఈ ఇద్దరి స్థానం సుస్థిరం కాబట్టి. సెలక్టర్లు ఏం


ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇదైతే నా ఎంపిక’ అని కృష్ణమాచారి శ్రీకాంత్‌ కుండ బద్దలు కొట్టాడు. 


Trending News

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా

షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే మిల్లా ఓ ట్రాన్స్‌జెండర్‌ ‘షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్‌. స్టార్‌ హీరోలకు సైతం...

Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste england

Arjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England&nbsp The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...

Sri sathya sai district news | latest sri sathya sai district news - eenadu

రామగిరి హెలిప్యాడ్‌ ఘటన.. విచారణకు హాజరైన పైలట్‌, కోపైలట్‌ ఈ నెల 8న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ...

India-pakistan: సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప...

Latests News

Shubman gill: టెస్ట్‌ కెప్టెన్సీ సంగతి తర్వాత.. గిల్‌ ముందు టీమ్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలి: శ్రీకాంత్‌

‘అంతా శుభ్‌మన్‌ గిల్‌ను కాబోయే కెప్టెన్‌ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులో స్థానమే పదిలం కాదు. బుమ్రానే క...

Eddie Jones discusses Manu Tuilagi selection

Leicester Tigers centre Tuilagi has not played international rugby since March 2016 having been riddled with injuries ov...

25 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత.. ఆ నీటిలో ఏం కలిసిందో తెలుసా? రైతులూ బీ అలర్ట్

Published by: Last Updated:April 02, 2023 4:01 PM IST గురువారం మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం 25 మంది కూలీలు పక్క మిర్...

Cyber security: సైబర్ సెక్యూరిటీ‌లో ఇండియా స్థానం ఏంటో తెలుసా?

Published by: Last Updated:June 28, 2021 7:05 PM IST CYBER SECURITY: గత ఏడాది జూన్‌లో వివాదస్పద లద్దాఖ్ సరిహద్దు ప్రాంతం...

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్...

Top