India-pakistan: సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
India-pakistan: సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి"
Play all audios:
India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా
పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో ఇరు దేశాల (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్
రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్
బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు
గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ
ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. * ఊళ్లు కావవి.. ఉగ్రకోటలు!.. అందుకే ఆ మూలాలపై మెరుపు దాడులు మంగళవారం అర్ధరాత్రి నుంచి
పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో 13 మంది భారత పౌరులు మృతిచెందగా.. 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు
చిన్నారులున్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
Trending News
Narayana hrudayalaya to raise rs 613 crore via ipoJP Morgan, PineBridge to partially exit through Narayana Hrudayalaya's Rs 613 crore IPO Renowned cardiologist Devi ...
Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూట...
Vikram Murthi – Rolling StoneVikram MurthiReporter70 Greatest Comedies of the 21st Century From rom-coms to raunch-coms, 'Anchorman' to 'Girls Trip' ...
Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...
Telangana cm kcr's daughter prathyusha gets marriedThe wedding of Chief Minister K Chandrashekar Rao’s daughter C Pratyusha's was held in Keshampet, Shadnagar near Hy...
Latests News
India-pakistan: సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతిIndia-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప...
Irctc ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..రైల్వే టికెటింగ్‌కు సంబంధించి ఇటీవల భారతీయ రైల్వే (Indian Railway) కీలక ప్రకటన చేసింది. ఐఆర్‌సీటీసీ (IRCTC)లో రైలు టికెట...
Srisailam project reservoir | శ్రీశైలానికి పోటెత్తిన వరదCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (07/05/2025)07/05/2025 21:39(IST) ఐపీఎస్‌లు బిందుమాధవ్, అమిత్ బర్దార్‌పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేసిన ప్రభుత్వం * ఎన్నికల్లో చెల...
Rahu-ketu dosha: రాహు కేతు దోషం ఉందా.. ఇవిగో పరిష్కార మార్గాలుజాతక దోషం.. మీ జాతకంలో రాహు-కేతువుల దశ-మహాదశ ఉంటే, వరుసగా సమస్యలు ఉంటాయి. రాహు కాటు పరంగా ఆర్థికంగా, సామాజికంగా మానసికంగ...