Cyber security: సైబర్ సెక్యూరిటీ‌లో ఇండియా స్థానం ఏంటో తెలుసా?

Telugu

Cyber security: సైబర్ సెక్యూరిటీ‌లో ఇండియా స్థానం ఏంటో తెలుసా?"

Play all audios:

Loading...

Published by: Last Updated:June 28, 2021 7:05 PM IST CYBER SECURITY: గత ఏడాది జూన్‌లో వివాదస్పద లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో సైనిక ఘర్షణల తర్వాత.. భారత నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా డ్రాగన్


కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇప్పుడిప్పుడే భారత్ పుంజుకుంటోంది. మెరుగైన మానవ వనరులు, సైబర్ సెక్యూరిటీ విషయంలో మనదేశం దూసుకెళ్తోంది. అయితే ఇతర దేశాలతో


పోలిస్తే సైబర్ సామర్థ్యం విషయంలో మన దేశం వెనుకంజలోనే ఉందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్(IISS) అనే సంస్థ తేల్చింది. సైబర్ సామర్థ్యం విషయంలో భారత్ వ్యూహం కేవలం


ప్రాంతీయంగానే ఉందని, ముఖ్యంగా పాకిస్థాన్ పైనే దృష్టి పెట్టిందని సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సైబర్ పవర్ పరంగా 15 దేశాలతో పోల్చి భారత ఆలోచనలను ఈ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది


జూన్‌లో వివాదస్పద లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో సైనిక ఘర్షణల తర్వాత.. భారత నెట్‌వర్క్‌లకు వ్యతికేరంగా డ్రాగన్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. అయితే భారత్.. చైనా వ్యవస్థలపై దృష్టి పెట్టకుండా,


సైబర్ భద్రత విషయంలో ఆందోళనలు పెంచిందని నివేదిక స్పష్టం చేసింది. భౌగోళిక-వ్యూహాత్మక అస్థిరత, సైబర్ ముప్పుపై తీవ్రమైన అవగాహన ఉన్నప్పటికీ సైబర్ స్పేస్ భద్రత విషయంలో భారత్ తన విధానం,


సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా తక్కువ పురోగతిని మాత్రమే సాధించిందని రిపోర్టు తెలిపింది. advertisement పాకిస్థాన్ పైనే దృష్టి.. ఈ విషయంలో ఐఐఎస్ఎస్ ప్రోగ్రాం లీడర్ గ్రెగ్ అస్టిన్


కూడా స్పందించారు. భారత్ వ్యూహం కేవలం ప్రాంతీయంగానే ఉందని, ముఖ్యంగా పాకిస్థాన్ పైనే దృష్టి పెట్టిందని తెలిపారు. ఇతర దేశాల భాగస్వామ్యంతో కలిసి నూతన సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు బలహీనతలను


భర్తీ చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ గవర్నెన్స్ విషయంలో భారత్ నెమ్మదిగా వృద్ధి సాధిస్తోందని నివేదిక పేర్కొంది. భారత సైబర్ ఇంటెలిజెన్స్ పరిధి ప్రాంతీయంగానే ఉందని,


విస్తృతంగా చూసేందుకు అమెరికా లాంటి భాగస్వామ్య దేశాలపై ఆధారపడుతుందని నివేదిక తెలిపింది. అంతేకాకుండా జాతీయ సైబర్ భద్రతను ప్రోత్సహించడంలో ప్రభుత్వం కంటే ప్రైవేటు రంగం చాలా వేగంగా ముందుకు


వెళ్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ టైర్-3 శ్రేణిలో ఉందని.. డిజిటల్, పారిశ్రామిక సామర్థ్యాన్ని ఉపయోగించడం, సైబర్ భద్రతను మెరుగుపరుచుకొని టైర్-2లో వెళ్లేందుకు ఇది గొప్ప అవకాశమని


నివేదిక పేర్కొంది. చైనా సైబర్ పవర్ యూఎస్ కంటే తక్కువగానే ఉందని, నెట్వర్క్ పొత్తుల విషయంలోనూ అమెరికాతో పోలిస్తే డ్రాగన్ వెనుకంజలోనే ఉందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. advertisement ఈ రంగంలో


భారత్ వృద్ధి సాధించడానికి రాజకీయ సంకల్పం అవసరమని ఆస్టిన్ తెలిపారు. దీంతో పాటు భారత్ తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఎలా నిర్వహిస్తుందనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. సైబర్ శక్తి


విషయంలో ప్రభుత్వాలు మరింత ప్రభావవంతంగా ఉండటానికి ఇతర దేశాలతో ఎలాంటి పొత్తులు కలిగి ఉంటారనేది కూడా ముఖ్యమని తెలిపారు. సైబర్ సామర్థ్యంలో విభాగాలు.. ప్రపంచ దేశాల సైబర్ సామర్థ్యాన్ని ఏడు


విభాగాల్లో అంచనా వేస్తారు. వ్యూహం-సిద్ధాంతం- పాలన, కమాండ్ కంట్రోల్, సైబర్ ఇంటెలిజెన్స్-సైబర్ సాధికారిత, ఆధారపడేతత్వం, సైబర్ భద్రత- స్థితిస్థాపకత, సైబర్ స్పేస్ వ్యవహారాల్లో గ్లోబల్ లీడర్షిప్,


అఫెన్సివ్ సైబర్ క్యాపబిలిటీ... అనే ఏడు విభాగాల్లో బలాలను అంచనా వేసి మెరుగ్గా ఉన్న దేశాలను టైర్-1లో ఉంచుతారు. ఈ విధంగా అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉండి టైర్-1 ఉన్న ఏకైక దేశం అమెరికా మాత్రమే.


భారత్ టైర్-3 కేటగిరీలో ఉంది. అంటే పైన పేర్కొన్న ఏడు విభాగాల్లో కొన్నింట్లో బలంగా ఉండి, మరికొన్నింట్లో బలహీనంగా ఉన్న దేశాన్ని ఈ విభాగంలో ఉంచుతారు. టైర్-2 విభాగంలో ఆస్ట్రేలియా, కెనడా, చైనా,


ఫ్రాన్స్, ఇజ్రాయిల్, రష్యా, యూకే లాంటి దేశాలు ఉన్నాయి. Location : First Published : June 28, 2021 6:20 PM IST Read More


Trending News

Virat kohli: విరాట్‌ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...

Rahul gandhi: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్‌ గాంధీ

చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాం...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్‌ చీఫ్‌

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర...

Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తు ముంబయిదే

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...

Latests News

Cyber security: సైబర్ సెక్యూరిటీ‌లో ఇండియా స్థానం ఏంటో తెలుసా?

Published by: Last Updated:June 28, 2021 7:05 PM IST CYBER SECURITY: గత ఏడాది జూన్‌లో వివాదస్పద లద్దాఖ్ సరిహద్దు ప్రాంతం...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Tattos: రాముడు అందరివాడు.. అందుకే మా దేహాన్నే దేవాలయంగా మార్చుకున్నాం..

ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం: ఎప్పుడో 1870ల నాటి మాట. సమాజంలో కులవివక్ష పూర్తిగా ఊడలు దిగిన కాలమది. ఆ ప్రాంతంలో ఉన్న గ్రా...

Nara lokesh: మీసం మెలేస్తూ నారా లోకేష్ సవాల్.. నడి రోడ్డుపై ఊరేగిస్తామంటూ మాస్ వార్నింగ్

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Hombale films to distribute l2: empuraan in karnataka

Hombale Films, the noted production company behind massive pan-India hits like _KGF_ and _KANTARA_, will be distributing...

Top