Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్ కైఫ్
Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్ కైఫ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓటమి పాలైంది. ఈ పరాజయంతో లఖ్‌నవూ ప్లేఆఫ్స్ రేసు
నుంచి నిష్క్రమించింది. ఆటగాళ్ల గాయాల వల్లే తమ టీమ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని రిషభ్ పంత్ (Rishabh Pant) మ్యాచ్ అనంతరం అన్నాడు. మయాంక్ యాదవ్, మోసిన్‌ఖాన్ లాంటి బౌలర్ల సేవలు అందుబాటులో
లేకపోవడం జట్టుకు చేటు చేసిందని అభిప్రాయం వ్యక్తంచేశాడు. దీనిపై టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) స్పందించాడు. అలాంటి ఆటగాళ్లను పెద్దమొత్తాలు వెచ్చించి
ప్రాంఛైజీ యాజమాన్యాలు రిటైన్ చేసుకోకూడదన్నాడు. ఐపీఎల్ (IPL) 2025 మెగా వేలానికి ముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లతో నికోలస్ పూరన్, రూ.11 కోట్లతో రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్,
రూ.4 కోట్లు వెచ్చించి మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. మయాంక్ యాదవ్ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగా, మోసిన్ ఖాన్ ఇప్పటివరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అలాగే లఖ్‌నవూ వేలంలో దక్కించుకున్న ఆకాశ్ దీప్ కూడా ఈ సీజన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు. ‘క్రికెట్‌లో ఇవన్నీ సహజమే’ ‘ఇది మా బెస్ట్ సీజన్ అవుతుందని అనుకున్నాం. కానీ చాలామంది ఆటగాళ్లు
గాయాల వల్ల టీమ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఖాళీలను మేం సరిగా భర్తీ చేయలేకపోయాం. నిజానికి మేం ఈ విషయాల గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. మేం ఆడిన
విధానంపై గర్వంగానే ఉన్నాం. నెగిటివ్ అంశాలను పక్కనపెట్టి, సానుకూల ధోరణిలోనే ముందుకు సాగుతాం’ అని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సారథి రిషభ్ పంత్ అన్నాడు. ‘బౌలింగ్ దళమంతా గాయాలతోనే..’ ‘నేనైతే
సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతాను. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్ దళమంతా గాయాలతోనే సతమతమవుతోంది. ఆటగాళ్లకు గాయాలు కావని నేను చెప్పడం లేదు. కానీ
ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకునే బదులు, వారిని వేలంలో తీసుకుంటేనే బాగుంటుంది’ అని మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Trending News
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Latests News
Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్ కైఫ్ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (...
Actress: అక్క మాజీ మిస్ ఇండియా, బావ సూపర్ స్టార్.. టీవీ షో ప్రమోషన్ కోసం స్టార్ హీరోయిన్ పాట్లుActress: అక్క మాజీ మిస్ ఇండియా, బావ సూపర్ స్టార్.. టీవీ షో ప్రమోషన్ కోసం స్టార్ హీరోయిన్ పాట్లుPublished by:Siva Nanduri...
Ind vs aus 4th test : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. టీమిండియాలో భారీ మార్పులు.. తుది జట్టు ఇదేటీమిండియా తుది జట్టు(అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రవీంద్ర జ...
Ap news: లిక్కర్ స్కామ్ కమీషన్లు గోవిందప్పకే చేరాయి.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలువిజయవాడ: మద్యం కుంభకోణం కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు రిమాండ...
Sathyaraj aka 'kattappa' from 'baahubali' apologises for his speech on the cauvery row!Actor Sathyaraj, popularly known for his role of Kattappa in SS Rajamouli's magnum opus Baahubali among others, has...