Bank nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌..

Eenadu

Bank nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌.."

Play all audios:

Loading...

Bank Nomination: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గించేందుకు ఆర్‌బీఐ నామినీల ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు కూడా తీసుకోవాలని భావిస్తోంది. Bank Nomination | ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు


డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సిద్ధమవుతోంది. నామినీ ఫారాల్లో నామినీల పేర్లతో పాటు ఇ-మెయిల్‌, వారి ఫోన్‌ నంబర్‌ వంటి


వివరాలనూ జోడించాలని భావిస్తోంది. దీనిపై బ్యాంకులు, ప్రభుత్వం నుంచి అభిప్రాయాలను కోరుతోంది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు


పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం కల్పించే బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు 2024కు ఇటీవల పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం నగదు


డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమయంలో నామినేషన్‌ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా నామినీ వివరాల సేకరణ సమయంలో వారి ఫోన్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ వివరాలు కూడా సేకరించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.


ఇందుకోసం బ్యాంకింగ్‌ కంపెనీస్‌ (నామినేషన్‌) రూల్స్‌, 1985ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఆర్థికరంగంలో ముఖ్యంగా బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఆ దిశగా


వివరాలు సేకరించాలని భావిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ‘ఎకనమిక్‌ టైమ్స్‌’కు వెల్లడించారు. నామినీ చిరునామా, అకౌంట్‌ హోల్డర్‌ వివరాలు మారినా నామినీల వివరాలు సేకరించడం ద్వారా


సమాచారం చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. తాము తెరిచిన పొదుపు, కరెంట్‌ ఖాతాలను ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోవడం, ఆ ఖాతాలను మూసివేయకపోవడం, కాలవ్యవధి దాటినా డిపాజిట్లను


ఉపసంహరించకపోవడం, ఖాతాదారులు మరణిస్తే, చట్టబద్ధ వారసులు లేదా నామినీలు ఈ డిపాజిట్లను తీసుకోవడానికి ముందుకురాకపోవడం వల్ల ఇలాంటి ‘క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల’ సమస్య తలెత్తుతోంది. సాధారణంగా


పదేళ్లపాటు ఉండే ఈ నగదును బ్యాంకులు ఆర్‌బీఐకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీన్ని తగ్గించే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది.


Trending News

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Kavitha | latest kavitha - eenadu

డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా భారాస మునిగిపోతున్న నావ అని, డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా అని, కవిత కేసీఆర్‌కు రాసిన లేఖకు ప్రా...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Sri lanka | latest sri lanka - eenadu

NED VS SL: శ్రీలంకకు గట్టి సవాల్.. అద్భుతంగా పోరాడిన సిబ్రాండ్‌, వాన్‌బీక్‌ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్య...

Assam: agp, aasu reject asom sanmilita mahasangha’s allegations over nrc

The Asom Gana Parishad (AGP) and All Assam Students’ Union (AASU) have expressed their strong resentment over the allega...

Latests News

Bank nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌..

Bank Nomination: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గించేందుకు ఆర్‌బీఐ నామినీల ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు కూడా తీసుకోవా...

Pm modi: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయమంటూ మోదీ పోస్ట్‌

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని నారాయణపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృ...

బిహార్‌లో మహాకూటమికి షాక్‌

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి...

కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా

షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే మిల్లా ఓ ట్రాన్స్‌జెండర్‌ ‘షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్‌. స్టార్‌ హీరోలకు సైతం...

Man suicide: ఓ ప్రేమ వ్యవహారం.. ప్రేమికుడి ఇంటిపై రాళ్ల దాడి.. యువకుడి తండ్రి మరణం.. అసలేం జరిగిందంటే..

Published by: Last Updated:April 21, 2021 2:15 PM IST MAN SUICIDE: ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడని.. దీంతో...

Top