Kl rahul: రాహుల్ ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు బలం: భారత బ్యాటింగ్ కోచ్
Kl rahul: రాహుల్ ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు బలం: భారత బ్యాటింగ్ కోచ్"
Play all audios:
దిల్లీ: టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ ప్రశంసల జల్లు కురిపించారు. అతను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు మారడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందన్నారు.
జట్టు అవసరాలకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ ఆర్డర్ మారడాన్ని కొనియాడారు. ‘‘రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు ఓపెనింగ్, 4, 5 స్థానాల్లో గతంలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఆరో స్థానంలో బరిలోకి
దిగుతున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా తొందరగానే అలవాటు పడతాడు. తన పాత్ర పట్ల కూడా సంతోషంగా ఉంటాడు. పలు స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్‌కు దిగడం, ఆ పరిస్థితులకు తగ్గట్లు సర్దుబాటు కావడం
అతనికే మేలు చేస్తోంది. అంతేకాకుండా అది టీమ్ ఇండియాకు సైతం ఎంతో ఉపయోగకరం. జట్టు అవసరాలకు తగ్గట్లు పలు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడం పట్ల రాహుల్ సంతోషంగా ఉన్నాడు’’ అని సితాన్ష్ కోటక్
అన్నారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గురించి కోటక్ మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లయిన రోహత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ, జడేజా ఉండడం వల్ల టీమ్
ఇండియా ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోగలదని పేర్కొన్నారు. సీనియర్లు, జూనియర్లు జట్టుకు సంబంధించి పలు విషయాల గురించి చర్చిస్తుండడం ఎంతో ఉపయోగకరమన్నారు. సీనియర్ ఆటగాళ్లు కనీసం 15 నుంచి 20
ఏళ్ల అనుభవం గడించారని, రెండు మూడేళ్ల క్రితం జట్టులోకి వచ్చినవారితో కలిసిపోతున్నట్లు తెలిపారు. అనుభవం గడించిన వారి మాటలను వినడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకోవచ్చని, అది అద్భుత పరిస్థితులను
సృష్టిందన్నారు. గతంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ ఎన్నో మంచి ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది శ్రీలంక పర్యటన నుంచి రాహుల్ ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి జట్టుకు ఉపయుక్తంగా మారాడు. సెమీస్‌లో 34 బంతుల్లో 42* పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో
జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ ప్రదర్శనపై పలువురు మాజీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిద్ధూ కేఎల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. జట్టుకు ఏ
అవసరం ఉన్నా.. అతడు బాధ్యత తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. ఈ ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో బరిలోకి దిగబోతోంది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి
న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Trending News
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Kuldeep yadav | latest kuldeep yadav - eenaduఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ...
Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this dateChiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...
Latests News
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (02-06-2025) మీరు తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. విందు, వ...
Telangana news: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు.. హాజరైన మంత్రి తుమ్మలభూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లో మూడో రోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్...
Jyoti malhotra: అవును.. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశాను: జ్యోతి మల్హోత్రా అంగీకారం..Jyoti Malhotra | ఇంటర్నెట్‌డెస్క్: గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో ...
Tamil nadu news | latest tamil nadu news - eenaduNO OIL NO BOIL: ఆ హోటల్లో... వండకుండానే వడ్డిస్తారు! ఇడ్లీ సాంబార్, అన్నం రసం, ఉప్మా, పొంగల్, బిర్యాని, వడ, పచ్చళ్లు, ...
ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణవిజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కా...