Jyoti malhotra: అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను: జ్యోతి మల్హోత్రా అంగీకారం..

Eenadu

Jyoti malhotra: అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను: జ్యోతి మల్హోత్రా అంగీకారం.."

Play all audios:

Loading...

Jyoti Malhotra | ఇంటర్నెట్‌డెస్క్‌: గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల


మీడియా సంస్థ పేర్కొంది. పాక్‌ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్నని పేర్కొంది. 2023లో వీసా కోసం పాక్‌ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్‌ పరిచయం అయ్యాడని ఆమె


వెల్లడించింది.  బ్లాకౌట్‌ వివరాలు కూడా పాక్‌కు.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పాక్‌ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక,


క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక


ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకొన్నాయి. దీంతోపాటు.. ఆమెకున్న రెండు బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నాయి. ఇక నేటితో జ్యోతి పోలీస్‌ కస్టడీ ముగియనుంది. ఆమెను హిస్సార్‌ కోర్టులో


హాజరుపర్చనున్నారు.  డైరీలో పాక్‌పై ప్రేమ.. తాజాగా జ్యోతి మల్హోత్రా డైరీ, ఫొటోలు వైరల్‌గా మారాయి. దానిలో ఆమె పాక్‌పై వల్లమాలిన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన


ప్రేమ లభించినట్లు పేర్కొంది. ఆ దేశం క్రేజీగా, కలర్‌ఫుల్‌గా ఉన్నట్లు అభివర్ణించింది. గూఢచర్యంలోకి దించిన ‘హ్యాపీనెస్‌’ పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌ వీసా విభాగంలో పని చేసేవాడు. పంజాబ్‌లోని


మలేర్‌కోట్లా ప్రాంతానికి చెందిన గజాల అనే యువతిని కూడా హనీట్రాప్‌లోకి లాగి.. గూఢచర్యానికి వాడుకొన్నట్లు తెలుస్తోంది. ఆమె తన కుటుంబలోని వారికి వీసాల కోసం ఫిబ్రవరి 2వ తేదీన పాక్‌ హైకమిషన్‌కు


వెళ్లింది. ఆ మర్నాడు వారి వీసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనేందుకు గజాలా ఆంటీ నస్రీన్‌ బానో హైకమిషన్‌కు వెళ్లింది. నాడు గజాలా వీసా మినహా అందరివి ఓకే అయినట్లు వెల్లడించారు. అదేనెల 27వ తేదీన


హైకమిషన్‌లో వీసా ఆఫీసర్‌ అంటూ డానిష్‌ నుంచి గజాలకు మెసేజ్‌ వచ్చింది. నాటినుంచి ఇద్దరి పరిచయం పెరిగింది. మరో ఫోన్‌ నెంబర్‌ నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ వాడాలని ఆమెకు సూచించాడు. చివరికి ఏప్రిల్‌లో


డానిష్‌ సాయంతో ఆమె పాక్‌ వీసా పొందింది. ఆ తర్వాత అతడికి పెళ్లైనట్లు ఆమె గుర్తించింది. మరోవైపు డానిష్‌ ఆమెను మెల్లగా గూఢచర్యానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. సైనిక స్థావరాల సమాచారాలు అడిగేవాడు.


ఆ తర్వాత నగదు లావాదేవీలు కూడా నడిపాడు. డానిష్‌ నెంబర్‌ గజాలా ఫోన్‌లో ‘హ్యాపీనెస్‌’ అనే పేరుతో సేవ్‌ చేసుకొన్నట్లు గుర్తించారు. పాక్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్‌


చేసి వారిని డానిష్‌ గూఢచర్యానికి వాడుకొనేవాడు. యూట్యూబర్‌ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను.. అతడు ట్రాప్‌ చేశాడు.


Trending News

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Latests News

Jyoti malhotra: అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను: జ్యోతి మల్హోత్రా అంగీకారం..

Jyoti Malhotra | ఇంటర్నెట్‌డెస్క్‌: గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో ...

Tamil nadu news | latest tamil nadu news - eenadu

NO OIL NO BOIL: ఆ హోటల్లో... వండకుండానే వడ్డిస్తారు! ఇడ్లీ సాంబార్‌, అన్నం రసం, ఉప్మా, పొంగల్‌, బిర్యాని, వడ, పచ్చళ్లు, ...

ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణ

విజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కా...

Pinapaka assembly election: payam venkateswarlu switches from ysrc to trs to contest in 2018 elections

Telangana Constituencies&nbsp HYDERABAD: Pinapaka is one of the 10 constituencies in Khammam district and a part of ...

Girl calls jaanu latest news in hindi, photos, videos on girl calls jaanu inextlive jagran

जब राह चलते लड़के से लड़की बोली 'जानू', तो मन में फूटे कैसे कैसे लड्डू! odd-news9 years ago राह चलते कोई खूबसू...

Top