Vetrimaaran: దానికి నేను బాధ్యత తీసుకోలేను: సూర్యతో సినిమాపై వెట్రిమారన్‌

Eenadu

Vetrimaaran: దానికి నేను బాధ్యత తీసుకోలేను: సూర్యతో సినిమాపై వెట్రిమారన్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోని దృష్టిలో పెట్టుకుని సినిమా కథను రాసేవారు కొందరైతే.. కథకు సరిపోయే కథానాయకుడిని ఎంపిక చేసుకునేవారు మరికొందరు. ఈ రెండో జాబితాకి చెందినవారే దర్శకుడు వెట్రిమారన్‌


(Vetrimaaran). వాస్తవికతకు పెద్దపీట వేసే ఆయన సూర్య (Suriya)తో ఇప్పటికే ‘వాడివాసల్‌’ (Vaadivaasal) సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ మూవీ గురించి


మాట్లాడారు. ‘సూర్యతో మీరు ప్రకటించిన సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు నెలకొన్నాయి’ అని హోస్ట్‌ ప్రస్తావించగా దర్శకుడు స్పందించారు. ‘‘నేను సినిమాలు తెరకెక్కిస్తా. 100 శాతం అంకితభావంతో


పనిచేస్తా. అంతే తప్ప అంచనాలకు బాధ్యత వహించలేను (నవ్వుతూ). ఒకవేళ నా చిత్రాలు ఆడియన్స్‌ అంచనాలు అందుకుంటే ఆనందిస్తా’’ అని పేర్కొన్నారు. * విడుదలకు సిద్ధమైన సినిమాను ఆపేద్దామన్నారు.. కానీ:


విజయ్‌ దేవరకొండ దర్శకుడి పేరు చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? అన్న అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుంచో డైరెక్టర్లకూ అభిమానులున్నారు. వారికీ ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నాయి. అయితే ప్రస్తుతం


పరిస్థితులు మారాయి. అగ్ర దర్శకుడు- స్టార్‌ హీరో కలిసి చేసినా సినిమా అయినా.. ట్రైలర్‌ చూశాకే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికొస్తున్నాడు. సినిమాని విడుదల రోజే చూడాలా? ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడాలా?


అనేది తేల్చుకుంటున్నాడు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడివాసల్‌’ తెరకెక్కనుంది. 2022లోనే ఈ సినిమా ప్రకటన వెలువడింది. నేపథ్యానికి సంబంధించిన గ్లింప్స్‌నూ విడుదల


చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని గతంలో రూమర్స్‌ వచ్చాయి. ‘విడుదల 2’ సినిమా తర్వాత తాను తెరకెక్కించేది ‘వాడివాసల్‌’నే అని ఆ సమయంలోనే వెట్రిమారన్‌ క్లారిటీ


ఇచ్చారు.


Trending News

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Hari hara veera mallu: పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమానే డైరెక్ట్‌ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి సంబంధించి పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన టెక్నీషియన్‌ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...

Latests News

Vetrimaaran: దానికి నేను బాధ్యత తీసుకోలేను: సూర్యతో సినిమాపై వెట్రిమారన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోని దృష్టిలో పెట్టుకుని సినిమా కథను రాసేవారు కొందరైతే.. కథకు సరిపోయే కథానాయకుడిని ఎంపిక చేసుకునేవ...

Pahalgam horror: ఉగ్రవాదుల ‘యూనిఫామ్‌’ కుట్రలు.. భద్రతా దళాలకు కొత్త సవాల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్‌ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక...

కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!

శ్రీనివాసగౌడ కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్‌ శెట్టి కూడా బోల్ట్‌ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు వి...

Roya Ijadi-Maghsoodi – The Conversation

Profile Articles Activity Dr. Roya Ijadi-Maghsoodi is an Assistant Professor-in-Residence in the UCLA Department of Psyc...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కలిసి నిలబడదామంటూ ప్రముఖుల పోస్ట్‌లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్‌ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్...

Top