Sonali bendre: తప్పుడు ప్రచారాలు నాకు నచ్చవు.. అందుకే నేనే నిజం చెప్పా: సోనాలి బింద్రే
Sonali bendre: తప్పుడు ప్రచారాలు నాకు నచ్చవు.. అందుకే నేనే నిజం చెప్పా: సోనాలి బింద్రే"
Play all audios:
ఒకప్పటి స్టార్ కథానాయిక సోనాలి బింద్రే (Sonali Bendre) ఒకానొక సమయంలో క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను తీసుకున్న ఓ నిర్ణయం గురించి తాజాగా ఆమె మాట్లాడారు. ముంబయి: ఒకప్పటి
స్టార్ కథానాయిక సోనాలి బింద్రే (Sonali Bendre) కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసందే. మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో తాను ఇబ్బందిపడుతున్నానని 2018లో ఆమే స్వయంగా ప్రకటించారు.
మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించడంపై
మాట్లాడారు. అలా చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందన్నారు. ‘‘క్యాన్సర్‌తో పోరాడుతున్నానని తెలిసిన సమయంలో ఆ విషయాన్ని అందరితో చెప్పాలనుకోలేదు. కానీ, అప్పట్లో నేనొక ప్రాజెక్ట్ కోసం వర్క్
చేస్తున్నా. ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుండేది. అదే సమయంలో నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స కోసం వెళ్లినప్పుడు.. అప్పటివరకూ కనిపించిన నేను ఒక్కసారిగా
మాయమయ్యానని ఒక్కొక్కరూ ఒక్కో మాదిరిగా మాట్లాడుకుంటారు. నా గురించి ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తారు. సోషల్‌మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేయవచ్చు. వాటి వల్ల నా కుమారుడు, తల్లిదండ్రులు,
కుటుంబసభ్యులు ఇబ్బందిపడొచ్చు. అది నాకు ఏమాత్రం నచ్చదు. అందుకే నా ఆరోగ్య పరిస్థితి గురించి నేనే ధైర్యంగా బయటపెట్టాను’’ అని ఆమె చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్ గురించి
మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో లుక్స్ పరంగా తాను ఎన్నో అవకాశాలు కోల్పోయానని అన్నారు. * అలా చేస్తే నాలో కాళికాదేవిని చూస్తారు: ప్రీతి జింటా క్యాన్సర్ నుంచి కోలుకున్న సోనాలి
బింద్రే ఆ మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో తాను ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానని గతంలో పలు ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ‘‘క్యాన్సర్ బారిన పడి కోలుకున్న
వారి జీవితాలు.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్‌కి తర్వాత అన్నట్లు ఉంటాయి. మనిషి తన జీవితంలో ఏదో ఒక దాని వల్ల పాఠాలు నేర్చుకోవాలి. నేను దీని(క్యాన్సర్) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. మన
జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ’’ అని ఆమె గతంలో చెప్పారు.
Trending News
సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...
Prabhas: ‘యానిమల్’ ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. సోషల్ మీడియాలో పోస్ట్రణ్బీర్ కపూర్-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశ...
Eenadu sports league | latest eenadu sports league - eenaduదంచికొట్టిన రాకర్స్.. దుమ్మురేపిన హీరోస్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోట...
Indo pak conflict: సరిహద్దులో ఉద్రిక్తతలు.. దిల్లీవ్యాప్తంగా సైరన్ల టెస్టింగ్భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్ రూమ్‌లు, అనేక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహించడంలో...
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పుఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వ...
Latests News
Sonali bendre: తప్పుడు ప్రచారాలు నాకు నచ్చవు.. అందుకే నేనే నిజం చెప్పా: సోనాలి బింద్రేఒకప్పటి స్టార్ కథానాయిక సోనాలి బింద్రే (Sonali Bendre) ఒకానొక సమయంలో క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తా...
Sharing a stunning wedding pic, rana daggubati wishes naga chaitanya and samantha on their anniversaryRana Daggubati wishes Naga Chaitanya and Samantha on their wedding anniversary   |  Photo Credit:&nb...
Whatsapp tricks: నంబర్ సేవ్ చేయకుండానే.. వాట్సాప్ చేసేయొచ్చు.. ఎలా అంటే..?నోట్స్, షాపింగ్ లిస్ట్, బుక్మార్క్లు, రిమైండర్లు, లింక్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు వంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడా...
Lik: నయన్ భర్త కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్ డేట్...
Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్ కేసులుఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప...