Sonu nigam: కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సోనూ నిగమ్
Sonu nigam: కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సోనూ నిగమ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శివశంకర్ అమరన్నవర్
నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మంగళవారం విచారించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో నిర్వహించిన కాన్సర్ట్‌లో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ
గాయకుడు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది. సోనూనిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడలోనే పాడాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో, సహనం కోల్పోయిన
సోనూ పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. భాషపై తనకు కూడా అభిమానం ఉందన్నారు. ఆ అభిమాని తనను బెదిరించినట్లు మాట్లాడటం నొప్పించిందన్నారు. ‘పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే
కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది’ అని ఘాటుగా స్పందించారు. దీంతో గాయకుడి వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగళూరు సిటీ యూనిట్
అధ్యక్షుడు ధర్మరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘కర్ణాటక ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆయనపై బ్యాన్ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సోనూ ఇటీవల ప్రకటన
విడుదల చేశారు. ‘‘అక్కడ తప్పు ఎవరిదో నిర్ణయించుకోవాలన్నది వివేకవంతులైన కర్ణాటక ప్రజలకే వదిలేస్తున్నా. వారి తీర్పును అంగీకరిస్తా. కర్ణాటక పోలీసులు, న్యాయ వ్యవస్థలను గౌరవిస్తా’’ అని
పేర్కొన్నారు.
Trending News
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...
Latests News
Sonu nigam: కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సోనూ నిగమ్ఇంటర్నెట్ డెస్క్: గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయా...
Kiit: నా బిడ్డకు భారత్ న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది: కీట్ విద్యార్థిని తండ్రిభువనేశ్వర్: ఒడిశాలో కీట్ (KIIT) విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యాయం ...
'avatar' vfx specialist chuck cominskey on board 'anizham thirunaal marthanda varma'The project will be directed by K Madhu and will feature extensive VFX work, which will be carried out on a lavish budge...
Wealth: ఈ ఏడాది ఎక్కువ సంపద కోల్పోయింది అదానీ, అంబానీయేGautam Adani- Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులైన అంబానీ, అదానీనే ఎక్కువ సంపద కోల్పోయారు. ఈ ఒక్క ఏడాదిలో అ...
One family: ఒకే ఒక్క కుటుంబం నివసించే గ్రామం.. ఎక్కడో తెలుసా?(ప్రతీకాత్మక చిత్రం) నల్‌బరి: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో...