Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

Eenadu

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల"

Play all audios:

Loading...

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వదేశంలో భారత


మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా వుమెన్స్‌ టీమ్‌తో సెప్టెంబర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. సెప్టెంబర్‌ 14న ప్రారంభమయ్యే ఈ


సిరీస్‌ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం ఇరు జట్ల సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ చెన్నై వేదికగా


మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభంకానున్నాయి. _ఇండియా VS ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ షెడ్యూలు_ * మొదటి వన్డే: సెప్టెంబర్‌ 14  * రెండో వన్డే సెప్టెంబర్‌ 17  *  మూడో వన్డే సెప్టెంబర్‌ 20 ఈ


సిరీస్‌లో విజయం సాధించి, వన్డే వరల్డ్‌ కప్‌లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనాలని భారత మహిళ జట్టు ఆకాంక్షిస్తోంది. 2007 సంవత్సరం నుంచి చెపాక్‌ స్టేడియం మహిళల వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది.


ఈ మైదానంలో మొదటగా భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ జరిగింది. ఇటీవలే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కూ చెపాక్‌ స్టేడియం వేదికైంది. గత సంవత్సరం భారత్‌, దక్షిణాఫ్రికా


మధ్య ఒక టెస్ట్‌  మ్యాచ్‌ సైతం ఈ మైదానంలోనే జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు చక్కటి ప్రదర్శనలు కనబరుస్తూ వస్తోంది. జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌ను


మట్టికరిపించింది. ఇటీవలే శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఫైనల్‌లో లంక జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Latests News

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Malayalam film industry: డ్రగ్స్‌ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్‌: నిర్మాత కీలక వ్యాఖ్యలు

మలయాళ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్. మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమల...

Dil raju: పవన్‌ కల్యాణ్‌ పెద్దన్నలాంటివారు.. తిడితే పడతాం: దిల్‌ రాజు

హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తమకు పెద్దన్నలాంటి వారని, తిడితే పడతామని ప్రముఖ నిర్మ...

Coronavirus: మళ్లీ కరోనా కలవరం.. దిల్లీలో 104 క్రియాశీల కేసులు.. మొదటిస్థానంలో కేరళ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో మరోసారి కరోనావైరస్ (coronavirus) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేస...

Pm modi: 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీ

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను ప్రధాని నర...

Top