Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్ కుమార్
Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్ కుమార్"
Play all audios:
చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్ ’ఆడియో లాంచ్‌కి ముఖ్య అతిథిగా కన్నడ యాక్టర్ శివ రాజ్‌కుమార్ హాజరయ్యారు. బెంగళూరులో కమల్ హాసన్‌ను కలిసిన తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై వేదికగా ఆడియో లాంచ్ నిర్వహించారు. దీనికి ముఖ్య
అతిథిగా కన్నడ యాక్టర్ శివ రాజ్‌కుమార్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమల్ సర్కి వీరాభిమానినని అన్నారు. ‘‘ఆయన నవ్వు, కళ్లు, వ్యక్తిత్వం అంటే నాకిష్టం. ఆయనలోని ప్రతి
విషయాన్ని నేను ఇష్టపడతాను. ఆయన సినిమాలు మొదటి రోజు, మొదటి షోలోనే చూస్తాను’’అని అన్నారు. బెంగళూరులోని తన ఇంట్లో కమల్‌హాసన్ కలిసిన విషయాన్ని పంచుకున్నారు. ‘‘నాకింకా గుర్తుంది . ఆయన మా
ఇంటికి వచ్చారు. మా నాన్న డా. రాజ్‌కుమార్‌తో ఆయన మాట్లాడారు. నాన్న నన్ను ఆయనకి పరిచయం చేశారు. నేను ఒక హగ్ ఇవ్వమని అడిగాను. ఆ తర్వాత నేను మూడు రోజుల పాటు స్నానం చేయలేదు. ఆ హగ్ ఫీలింగ్
అలాగే ఉండాలని కోరుకున్నాను. ఆయన సినిమాల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను వారితో గొడవపడేవాడిని. వారు చెడుగా చెప్పినా నేను మంచి గురించే ఆలోచిస్తాను’’అని శివ రాజ్‌కుమార్ అన్నారు. తాను
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో కమల్ హాసన్ ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘నాకింకా గుర్తుంది. నాకు మియామిలో క్యాన్సర్ సర్జరీ అయ్యింది. ఆ
సమయంలో కమల్ సర్ చికాగోలో ఉన్నారు. సర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ‘నీకు తెలియదు కానీ శివన్నా.. నీతో మాట్లాడుతుంటే, నాకు కన్నీళ్లు ఆగడంలేదు
’అని కమల్ అన్నారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోను. నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది’’. అని అన్నారు. కమల్ హాసన్ సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘ఒరే నాల్ ఉన్నయ్ నాన్’ అనే పాటను
పాడి అలరించారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్ కుమార్చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్ ’ఆడియో లాంచ్‌కి ముఖ్య అతిథిగా కన్నడ యాక్టర్ శివ రాజ్‌కుమార్ హాజరయ్యారు. బెంగళూరులో కమల్ హ...
Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్ఎఫ్గుజరాత్లోని బనస్కాంతలో భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చేశారు. ...
Ktr: కవిత లేఖ.. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీసిద్దిపేట: భారాస (BRS) అధినేత కేసీఆర్‌తో (KCR) ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) భేటీ ఆయ్యారు. సిద్దిపేట ...
Loan against guarantee: ఇలాంటి ఆస్తులపై పూచీకత్తు రుణం పొందొచ్చు..గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పా...
Financial changes: ఆధార్ అప్డేట్.. పీఎఫ్ 3. 0.. క్రెడిట్ కార్డ్ రూల్స్.. జూన్‌లో వచ్చే మార్పులివేFinancial changes | ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక అంశాలు తరచూ మారుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం. మరికొన...