Ruchi gujjar: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి.. టీ షర్ట్‌తో జాన్వీ

Eenadu

Ruchi gujjar: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి.. టీ షర్ట్‌తో జాన్వీ"

Play all audios:

Loading...

మోదీ ఫొటో నెక్లెస్‌ ధరించిన రుచి గుజ్జర్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆమె సందడి చేశారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది ‘కేన్స్‌


ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Cannes Film Festival). ఈ నెల 13న ప్రారంభమైన ఆ సినీ వేడుక 24న ముగియనుంది. రెడ్‌కార్పెట్‌పై ఇప్పటికే పలువురు తారలు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. అలనాటి నటీమణుల


మినియేచర్‌ ఫొటోలతో కూడిన ముత్యాల దండను జడకు సింగారించుకుని బాలీవుడ్‌ నటి నితాన్షీ అందరి చూపు తనవైపునకు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి రుచి గుజ్జర్‌ (Ruchi Gujjar).. ప్రధాని


నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్‌ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీపై


గౌరవంతో కేన్స్‌లో ఆ నెక్లెస్‌ ధరించానని రుచి మీడియాకు చెప్పారు. దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్నారని మోదీని కొనియాడారు. మిస్‌ హరియాణా 2023 విజేత అయిన రుచి పలు మ్యూజిక్‌ వీడియోల్లో,


పలు హిందీ సినిమాల్లో నటించారు. * కేన్స్‌లో జడతో ఫేమస్‌.. ఎవరీ నీతాన్షీ గోయెల్‌ జాన్వీ కపూర్‌ సినిమా స్క్రీనింగ్‌.. ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నీరజ్‌ ఘైవాన్‌


తెరకెక్కించిన ‘హోమ్‌ బౌండ్‌’ (Home Bound) సినిమాని ఆ వేడుకలో బుధవారం ప్రదర్శించనున్నారు. చిత్ర బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. సినిమా టైటిల్‌ లోగో ఉన్న టీ షర్ట్‌ ధరించిన జాన్వీ కపూర్‌


సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు, తన కుమార్తెతో కలిసి ఐశ్వర్యారాయ్‌ మంగళవారం అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఐశ్వర్య వెళుతుంటారనే సంగతి


తెలిసిందే.


Trending News

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Ruchi gujjar: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి.. టీ షర్ట్‌తో జాన్వీ

మోదీ ఫొటో నెక్లెస్‌ ధరించిన రుచి గుజ్జర్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆమె సందడి చేశారు....

Sailesh kolanu: ఇది సూపర్‌‘హిట్‌’ బొమ్మ.. ఒకేచోట కలిసిన టాలీవుడ్‌ దర్శకులు

హైదరాబాద్‌: నాని (Nani) హీరోగా శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). మే...

Boycott turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌

Boycott turkey: భారత్, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే బ్రాండ్లను నిషేధించాలంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో టర్కీ ...

క్యాన్సర్‌ నిస్సత్తువను జయిద్దాం రండి!

క్యాన్సర్‌ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్‌ వ్యాధి కారణంగానూ, చికిత్స...

Ttd: తిరుమలలో ఎల్లుండి నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం: మంత్రి ఆనం

తిరుమలలో ఎల్లుండి (గురువారం) నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తి...

Top