Boycott turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌

Eenadu

Boycott turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌"

Play all audios:

Loading...

Boycott turkey: భారత్, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే బ్రాండ్లను నిషేధించాలంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో టర్కీ  తయారుచేసే వస్త్రాలను ప్రముఖ రిటైల్‌ సంస్థలు నిలిపివేశాయి. Boycott


turkey | ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తుర్కియే


దేశంపై భారత్‌లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ (Boycott Turkey) పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో


ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు మింత్రా, అజియో.. ఆ దేశ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాయి. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అక్కడి బ్రాండెడ్‌ దుస్తులను చూపించడం ఆపేశాయి. బాయ్‌కాట్‌ తుర్కియే నినాదం


జోరందుకున్న క్రమంలో వ్యాపారులు ఆ దేశంతో వర్తక, వ్యాపారాలను నిలిపేస్తున్నారు. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మింత్రా అధికారి


వెల్లడించారు. రిలయన్స్‌ కూడా తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ అజియోలో విక్రయిస్తున్న కోటాన్‌, ఎల్‌సీ వైకికి, మావి వంటి తుర్కిష్‌ దుస్తుల బ్రాండ్ల అమ్మకాల్ని ఆపేసింది. ఆ దేశంలో సంస్థ కార్యాలయాన్ని


కూడా మూసివేసినట్లు రిలయన్స్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. * తుర్కియేతో తెంచేసుకుందాం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలతో పర్యాటకం సహా అన్నిరకాల వ్యాపార సంబంధాలు


తెంచుకోవాలని దేశీయ వర్గాలు ఇప్పటికే నిర్ణయించాయి. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్‌) సైతం ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది.  భారత ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు,


వ్యాపార వర్గాలు సైతం ఆ రెండు దేశాల్లోని కంపెనీలతో ఎటువంటి సంబంధాలూ పెట్టుకోరని తెలిపింది. విమానాశ్రయాల్లో భద్రతా పరమైన సేవలందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్‌కు సెక్యూరిటీ


క్లియరెన్స్‌ను ఇదివరకే కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇస్తాంబుల్‌లో కంపెనీ షేర్లు క్రమంగా పతనమవుతున్నాయి.


Trending News

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Boycott turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌

Boycott turkey: భారత్, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే బ్రాండ్లను నిషేధించాలంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో టర్కీ ...

క్యాన్సర్‌ నిస్సత్తువను జయిద్దాం రండి!

క్యాన్సర్‌ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్‌ వ్యాధి కారణంగానూ, చికిత్స...

Ttd: తిరుమలలో ఎల్లుండి నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం: మంత్రి ఆనం

తిరుమలలో ఎల్లుండి (గురువారం) నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తి...

Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వ...

Chopra wins historic gold; dharun, sudha, neena clinch silvers

Jakarta, Aug 27 (IANS) Indian athletes enjoyed a successful day at the 2018 Asian Games with reigning continental champi...

Top