Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. కొన్ని గంటల్లోనే క్షమాపణలు చెప్పిన దర్శకుడు
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. కొన్ని గంటల్లోనే క్షమాపణలు చెప్పిన దర్శకుడు"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో బాలీవుడ్లో ఓ సినిమా సిద్ధం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ టైటిల్ పోస్టర్‌ను విడుదల
చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమయం, సందర్భం లేకుండా టైటిల్ రివీల్ చేసినందుకు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురుకావడంతో చివరకు ఆయన క్షమాపణలు చెబుతూ స్టేట్మెంట్
విడుదల చేశారు. ఎదుటివ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. డబ్బు లేదా ఫేమ్ కోసం తాను ఇలాంటి పని చేయలేదని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు
ప్రకటించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని, నాయకత్వాన్ని ఒక పవర్ఫుల్ కథగా వెండితెరపైకి
తీసుకురావాలని అనుకున్నా. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించాలనుకున్నా. అంతేకానీ, డబ్బు లేదా ఫేమ్ కోసం కాదు. అయితే, సమయం, సున్నితత్వం కొంతమందికి అసౌకర్యం కలిగించి
ఉండొచ్చు. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇది దేశ ప్రజల ఎమోషన్’’ అని ఆయన రాసుకొచ్చారు. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో
26 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పలువురు మహిళలు వారి కళ్ల ముందే తమ భర్తలను కోల్పోయారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా చేసేందుకు ఎన్నో నిర్మాణసంస్థలు ఆసక్తి చూపించాయి. ఆ టైటిల్‌ను సొంతం
చేసుకునేందుకు పోటీపడ్డాయి. నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో శుక్రవారం రాత్రి సినిమా ప్రకటించారు. పహల్గాం ఘటన, మన సైనికుల ధైర్య
సాహసాలను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయంPublished by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Murti latest news in hindi, photos, videos on murti inextlive jagranदेश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...
Latests News
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. కొన్ని గంటల్లోనే క్షమాపణలు చెప్పిన దర్శకుడుఇంటర్నెట్డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో బాలీవుడ్లో ఓ సినిమా సిద్ధం కానుంది. ఇదే విషయాన్ని తెల...
ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు?ఐపీఎల్–2020కి ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముంబై: ఇండియన్ ప్రీమియర్...
Ott movies this week: ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీలు.. ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయ్నాని (Nani) హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ (HIT 3). ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స...
Sonu nigam: కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సోనూ నిగమ్ఇంటర్నెట్ డెస్క్: గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయా...
Army: కాల్పుల మోత లేదు.. 19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి ఇక్...