Kamal haasan: ‘థగ్ లైఫ్’ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
Kamal haasan: ‘థగ్ లైఫ్’ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ భాషపై సినీనటుడు కమల్ హాసన్(Kamal Haasan) ఇటీవల చేసిన కర్ణాటకలో అధికార, విపక్ష పార్టీలు, సంఘాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఆయన చిత్రం ‘థగ్ లైఫ్’ కర్ణాటకలో విడుదల
వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life)ను కర్ణాటకలో విడుదల చేసి ప్రదర్శించేందుకు వీలుగా ఆదేశాలు జారీ
చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో దాఖలు చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర
ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని కమల్
హాసన్ కోరారు. * నేను చప్పట్లు కొట్టలేదు.. కన్నడ కోసం నా ప్రాణమిస్తా: శివరాజ్ కుమార్ ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్
హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై అధికార, విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి.
మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే.. ఆయన ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని కేఎఫ్‌సీసీ స్పష్టం చేసింది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ (జూన్ 5) దగ్గర పడుతుండంతో
న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు, కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ వస్తోన్న డిమాండ్లను కమల్ హాసన్
(Kamal Haasan) ఇటీవల తోసిపుచ్చారు. తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానన్నారు. ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు
చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
Trending News
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
Aita under-16 tennis: pranav, amodini emerge championsBengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...
Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..Stock Market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...
Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామిTesla | ఇంటర్నెట్‌డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...
Ali: రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అనలేదు: అలీఇంటర్నెట్ డెస్క్: తనపై రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ (Ali) అభిప్రాయపడ్డార...
Latests News
Kamal haasan: ‘థగ్ లైఫ్’ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్ఇంటర్నెట్ డెస్క్: కన్నడ భాషపై సినీనటుడు కమల్ హాసన్(Kamal Haasan) ఇటీవల చేసిన కర్ణాటకలో అధికార, విపక్ష పార్టీలు, సంఘాల...
Pellikani prasad 2025 ott: ఓటీటీలో ‘పెళ్లికాని ప్రసాద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?సప్తగిరి, ప్రియాంకశర్మ కీలక పాత్రల్లో నటించిన ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హైదరాబాద్: ...
Sarfaraz khan: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్‌కు మధ్య పోటాపోటీగా జరుగుతున్న అనధికార తొలి టెస్ట్ మ్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌న...
Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఓ యువకుడు తన తల్లి కోసం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు ...
Chhatrapati sambhajinagar: lord ram, goddess sita's padukas welcomed amid grand celebrations at kranti chowk - photos insideChhatrapati Sambhajinagar: Lord Ram, Goddess Sita's Padukas Welcomed Amid Grand Celebrations At Kranti Chowk - PHOT...